కంటతడి పెట్టిస్తున్న హీరోయిన్ సీమంతం.. మరణించిన భర్త కటౌట్ సమక్షంలో వేడుక..

  • Published By: sekhar ,Published On : October 7, 2020 / 09:27 PM IST
కంటతడి పెట్టిస్తున్న హీరోయిన్ సీమంతం.. మరణించిన భర్త కటౌట్ సమక్షంలో వేడుక..

Updated On : October 17, 2020 / 8:33 PM IST

Meghana Raj’s Baby Shower: ప్రముఖ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, పాపులర్ కన్నడ యువ హీరో చిరంజీవి సర్జా హీరోయిన్ మేఘనతో పదేళ్లు ప్రేమాయణం తర్వాత 2018 ఆమెను వివాహం చేసుకున్నారు.

అయితే రెండేళ్ళు కూడా కలిసి జీవించకుండానే ఆమెకు దూరమయ్యారు. చిరంజీవి సర్జా ఈ ఏడాది మొదట్లో ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. శ్వాస కోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు.


కాగా చిరంజీవి సర్జా చనిపోయే నాటికి మేఘనా రాజ్ గర్భవతి. తాజాగా మేఘన సీమంతం వేడుకను చిరంజీవి కుటుంబ సభ్యులు ఘనంగా జరిపించారు. అయితే ఎందరు ఉన్నా భర్త లేని లోటు మాత్రం ఎవరూ తీర్చలేనిది కదా.. అందుకే ఈ వేడుకలో చిరంజీవి తన పక్కనే ఉన్నాడన్న ఫీల్ కలిగేలా మేఘనా రాజ్ కూర్చున్న కుర్చీ పక్కనే అతని కటౌట్‌ ఏర్పాటుచేశారు.


కరోనా కారణంగా ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారంతా కూడా బరువెక్కిన హృదయంతో మేఘనాని ఆశీర్వదించారు. ఇక మేఘన సీమంతం వేడుకల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన చిరంజీవి సర్జా అభిమానులు భావోద్వేగానికి లోనవుతూ కంటతడి పెట్టుకుంటున్నారు. చిరంజీవి సర్జా తమ్ముడు ధృవ సర్జా కన్నడలో హీరోగా కొనసాగుతున్నారు.Meghana Raj Meghana Raj

Meghana Raj

https://www.instagram.com/p/CBkGaEOnK_D/?utm_source=ig_web_copy_link