Chiranjeevi – Sreeleela : ‘విశ్వంభర’లో శ్రీలీల..? స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. ఫొటోలు వైరల్..

విశ్వంభర సెట్ లో హీరోయిన్ శ్రీలీలకు చిరంజీవి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.

Chiranjeevi – Sreeleela : ‘విశ్వంభర’లో శ్రీలీల..? స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. ఫొటోలు వైరల్..

Chiranjeevi Special Gift to Sreeleela on Womens Day at Vishwambhara Sets Photos goes Viral

Updated On : March 9, 2025 / 4:09 PM IST

Chiranjeevi – Sreeleela : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుంది అని అంటున్నారు.

అయితే నిన్న ఉమెన్స్ డే సందర్భంగా విశ్వంభర సెట్ లో హీరోయిన్ శ్రీలీలకు చిరంజీవి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.

Chiranjeevi Sreeleela

దుర్గాదేవి ప్రతిమ ఉన్న వెండి శంఖంను చిరంజీవి శ్రీలీలకు బహుమతిగా ఇచ్చారు.

Also Read : Chef Mantra : ‘ఆహా’ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K ఎపిసోడ్ 2 ప్రోమో వచ్చేసింది.. సుమ – రాజీవ్ వెడ్డింగ్ యానివర్సరీతో ఫుల్ కామెడీ..

విశ్వంభర సెట్ లో ఈ గిఫ్ట్ ఇచ్చి ఫొటోలు దిగడంతో పాటు, శ్రీలీల కూడా సినిమా కాస్ట్యూమ్ లో ఉండటంతో శ్రీలీల విశ్వంభర సినిమాలో నటిస్తుందా అని సందేహం వ్యక్తపరుస్తున్నారు.

Chiranjeevi Sreeleela

విశ్వంభరలో చిరంజీవి సరసన త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా మరో అయిదుగురు చిరు చెల్లెలి పాత్రల్లో నటిస్తున్నారు.

Chiranjeevi Sreeleela

శ్రీలీల కూడా ఆ ఐదుగురిలో ఒకరా? లేక వేరే ఏదన్నా స్పెషల్ క్యారెక్టర్ చేస్తుందా అని చర్చలు నడుస్తున్నాయి.

Chiranjeevi Sreeleela

ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర సెట్లో శ్రీలీల దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.