Mana Shankara Varaprasad Garu : రెండొందల కోట్లు కొల్లగొట్టిన మెగాస్టార్.. మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్ జోరు..

ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. (Mana Shankara Varaprasad Garu)

Mana Shankara Varaprasad Garu : రెండొందల కోట్లు కొల్లగొట్టిన మెగాస్టార్.. మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్ జోరు..

Mana Shankara Varaprasad Garu

Updated On : January 16, 2026 / 4:32 PM IST

Mana Shankara Varaprasad Garu : అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. ప్రీమియర్స్ నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా వెంకటేష్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు.(Mana Shankara Varaprasad Garu)

పండక్కి ఊళ్ళల్లో అందరూ మన శంకర వరప్రసాద్ గారు సినిమాకే క్యూ కడుతున్నారు. దీంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు సినిమా మొదటి రోజే ఏకంగా 84 కోట్ల గ్రాస్ వసూలు చేసి చిరు కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.

Also See : Nayanthara : చిరంజీవితో హిట్ కొట్టి.. దుబాయ్‌లో సంక్రాంతి చేసుకుంటున్న నయనతార.. ఫ్యామిలీతో ఫొటోలు వైరల్..

తాజాగా మూవీ యూనిట్ నాలుగు రోజుల కలెక్షన్స్ ని ప్రకటించారు. నిన్నటి వరకు నాలుగు రోజుల్లో ఈ సినిమా 190 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు నేడు ఉదయం ప్రకటించారు. తాజాగా ఉదయం ఆటతో మన శంకర వరప్రసాద్ గారు సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Chiranjeevi Venkatesh Anil Ravipudi Mana Shankara Varaprasad Garu Movie Collections

ఈ సినిమాకు 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 240 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఆల్రెడీ 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది కాబట్టి సంక్రాంతి పండగ హాలిడేస్ ఇంకా ఉండటం, సినిమా హిట్ టాక్ రావడంతో ఈజీగా 300 కోట్లపైనే కలెక్షన్స్ వచ్చేస్తాయని అంచనా వేస్తున్నారు.

Also Read : Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి సంక్రాంతి సెలబ్రేషన్స్.. కొడుకుతో కలిసి.. ఫొటోలు..