Allu Arjun : మేనల్లుడిని చూసి కన్నీరు పెట్టుకున్న చిరంజీవి సతీమణి సురేఖ
చిరంజీవి సతీమణి సురేఖ శనివారం తన మేనల్లుడు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు.

Chiranjeevi Wife Surekha Gets Emotional to See Allu Arjun
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో బన్నీ నివాసానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. నిర్మాత దిల్‌రాజు, వంశీ ఫైడిపల్లి, దర్శకుడు కొరటాల శివ, దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో శ్రీకాంత్ పలువురు బన్నీని పరామర్శించారు.
Allu Arjun : అల్లు అర్జున్‌ను ఉద్దేశ్యపూర్వకంగానే రాత్రంతా జైలులో ఉంచారా?
ఇదిలా ఉంటే.. చిరంజీవి సతీమణి సురేఖ శనివారం తన మేనల్లుడు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. బన్నీని చూడగానే ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తాజా పరిణామాల గురించి మాట్లాడి పరామర్శించారు. బన్నీని హత్తుకుని ధైర్యం చెప్పారు.