Oppenheimer : ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆట‌మ్ బాంబు ఓ రేంజ్‌లో పేలింది.. రెండు వారాల్లో 100 కోట్లు..

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆట‌మ్ బాంబు ఓ రేంజ్‌లో పేలుతుంది. ఆట‌మ్ బాంబు తయారీ నేపథ్యంతో ప్ర‌ముఖ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమా..

Oppenheimer : ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆట‌మ్ బాంబు ఓ రేంజ్‌లో పేలింది.. రెండు వారాల్లో 100 కోట్లు..

Chirstopher Nolan Oppenheimer collected 100 crores in India

Updated On : July 30, 2023 / 5:43 PM IST

Oppenheimer : ఈ జులై నెలలో హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మిషన్ ఇంపాజిబుల్ 7, బార్బీ, ఓపెన్‌ హైమర్‌ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ మూడింటిలో ఓపెన్‌ హైమర్‌ ఎక్కువ ప్రజాధారణ పొందింది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఆట‌మ్ బాంబు తయారీ నేపథ్యంతో ప్ర‌ముఖ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు క్రిస్టోఫర్ నోలన్ (Chirstopher Nolan).. తెరకెక్కించిన ఈ సినిమా జులై 21న రిలీజ్ అయ్యింది. ఆట‌మ్ బాంబు స్టోరీ, క్రిస్టోఫర్ నోలన్ డైరెక్టర్ అనేపాటికి మూవీ పై ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Rajinikanth : నేను జీవితంలో చేసిన అతి పెద్ద త‌ప్పు అదే.. సూప‌ర్ స్టార్ బిరుదుతో ఎప్పుడూ స‌మ‌స్యే : ర‌జినీకాంత్‌

అంతేకాదు ఈ అణుబాంబు తయారీకి.. మన భ‌గ‌వ‌ద్గీత‌లోని ఓ శ్లోకం కారణం కావడంతో ఇండియన్ ఆడియన్స్ లో మరింత ఆసక్తి నెలకుంది. దీంతో ఈ మూవీకి మొదటిరోజే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంది. రెండు వారాల్లో ఈ మూవీ ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం చూస్తే.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆట‌మ్ బాంబు ఏ రేంజ్ లో పేలిందో అర్ధమవుతుంది. అయితే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో మాత్రం.. ఓపెన్‌ హైమర్‌ కంటే ముందు బార్బీ ఉంది.

Pawan – Karan : పవన్ సినిమా దగ్గరిలో కూడా లేవు.. కరణ్ జోహార్ మూవీ కలెక్షన్స్..

కాగా ఓపెన్‌ హైమర్‌ లోని ఒక సన్నివేశం ఇండియాలో వివాదం అయ్యింది. సినిమాలోని శృంగార స‌న్నివేశంలో భ‌గ‌వ‌ద్గీత‌లోని ఓ శ్లోకాన్ని హీరో చదువుతాడు. భార‌తీయులు ఎంతో పవిత్రంగా భావించే భ‌గ‌వ‌ద్గీత ను ఆ సంద‌ర్భంలో చూపించ‌డం స‌రైన‌ది కాద‌ని, వెంట‌నే సినిమాలోంచి ఆ స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీని పై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సన్నివేశాలకు అనుమతి ఇచ్చిన సెన్సార్ బోర్డు వారి పై కూడా చర్యలు తీసుకున్నారు.