తిరుమలలో సాయి ధరమ్ తేజ్

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 07:12 AM IST
తిరుమలలో సాయి ధరమ్ తేజ్

Updated On : April 9, 2019 / 7:12 AM IST

మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల, నటుడు చలపతి రావులు కలిసి ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అయిన తరువాత రంగనాయకుల మండపంలో ధర్మతేజ్ మరియు టీం కు వేదపండితులు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. 

చిత్రలహరి సినిమా 12వ తేదీన విడుదల కానుందని, అందుకే స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు వచ్చామని. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు సాయి ధర్మతేజ్ తెలిపారు.