తేజ్‌కు కలిసొచ్చేనా : చిత్రలహరికి గుమ్మడికాయ

  • Published By: madhu ,Published On : March 16, 2019 / 07:21 AM IST
తేజ్‌కు కలిసొచ్చేనా : చిత్రలహరికి గుమ్మడికాయ

‘సాయి ధరమ్ తేజ’ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన నటించిన చిత్రాలు అంతగా ఆడలేదు. దీనితో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఉవ్విళూరుతున్నాడు ఈ నటుడు. అందుకనే పట్టుదలతో పనిచేస్తున్నాడు. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘చిత్రలహరి’ షూటింగ్ పూర్తయ్యింది. గుమ్మడికాయ కొట్టేశారు. ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయినట్లు తేజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. చిత్ర యూనిట్‌తో కలసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. ‘చిత్రలహరి షూటింగ్ పూర్తయింది. చిత్ర యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు’ అని తేజ్ ట్వీట్ చేశాడు.

కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ‘చిత్ర లహరి’ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో సాయి ధర్మ్ తేజ సరసన కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడం విశేషం. ఇటీవలే సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇది అభిమానులను ఆకట్టుకోవడంతో చిత్రంపై దర్శకుడు నటీనటులు హిట్టవుతుందనే నమ్మకం పెట్టుకున్నారు. యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉంటుందని తెలుస్తోంది. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇక తేజ్ విషయానికి వస్తే ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మరి తేజ్‌కు సరియైన హిట్ పడుతుందా ? లేదా ? అనేది చూడాలి.