మూవీ రివ్యూ : చిత్రలహరి

మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో సాయి ధరమ్ తేజ్.. వరస ప్లాప్ లతో సతమత మవుతున్నాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్న తేజ్.. చిత్రలహరి సినిమాతో మళ్లీ వచ్చాడు. హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రలహరి సాయి ధరమ్‌కు హిట్ ఇచ్చిందా..? లేక మరో ప్లాప్ గా నిలచిందా అనేది ఇప్పుడు చూద్దా.
Read Also : మొబైల్, వెబ్ వెర్షన్ : ‘Jio News’ యాప్ వచ్చేసింది
కథ విషయానికొస్తే..
విజయ్ కృష్ణ జీవితంలో సక్సెస్ అంటే తెలియని కుర్రాడు. ఈ పోటి ప్రపంచంలో గెలవలేకపోతున్నా అని విజయ్ నిరుత్సాహపడినా.. తండ్రి నారాయణ మాత్రం తన కొడుకు ఎప్పటికైన సక్సెస్ అవుతాడన్న నమ్మకంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. యాక్సిడెంట్‌లో సరైన సమయానికి సహాయం అందక చనిపోతున్న వారిని కాపాడేందుకు విజయ్ ఓ డివైజ్‌ను తయారు చేస్తాడు.
స్పాన్సర్‌షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే లహరి పరిచయం అవుతుంది. తన అలవాట్లు, ఉద్యోగం గురించి అబద్దాలు చెప్పి లహరిని ప్రేమిస్తాడు విజయ్. ఓ రోజు లహరికి నిజం తెలిసిపోతుంది. విజయ్‌ని వదిలేసి దూరంగా వెళ్లిపోతుంది. ప్రేమలోనూ సక్సెస్ దక్కలేదని మరింత కుంగిపోతాడు విజయ్. అలాంటి విజయ్ తిరిగి ఎలా సక్సెస్ సాధించాడు.? ఈ కథలో స్వేచ్ఛ పాత్ర ఏంటి? అన్నదే మిగతా కథ.
నటీనటుల విషయానికొస్తే..
పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈసారి టచ్ చేయని ఓ కొత్త తరహా పాత్రను ఎంచుకున్నాడు. నేటి యూత్ ను రిప్రజెంట్ చేసే క్యారెక్టర్‌లో తనవంతుగా బాగానే నటించాడు. తన రేంజ్‌లో ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, డాన్స్‌లు చేసే చాన్స్ దక్కలేదు. మెచ్యుర్డ్ పర్ఫామెన్స్‌తో విజయ్ కృష్ణ పాత్రలో జీవించాడు. హీరోయిన్‌గా కల్యాణీ ప్రియదర్శని పరవాలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో డబ్బింగ్ కాస్త ఇబ్బందిగా అనిపించింది. మరో హీరోయిన్‌గా నటించిన నివేదా పేతురాజ్‌కు పెద్దగా వేరియేషన్స్ చూపించే చాన్స్ దక్కలేదు. కార్పోరేట్ ఉమెన్‌గా నివేదా లుక్ ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, సునీల్, వెన్నల కిశోర్ తమ పరిధి మేర బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చారు.
టెక్నీషియన్స్ విషయానికొస్తే…
సెన్సిబుల్ పాయింట్స్‌తో సినిమాలను తెరకెక్కించే కిషోర్ తిరుమల చిత్రలహరి కోసం మరో ఇంట్రస్టింగ్ లైన్ తీసుకున్నాడు. నేటి యూత్ సక్సెస్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు. సక్సెస్ వెంట పరిగెడుతూ తమని తాము ఎలా కోల్పోతున్నారు అన్న విషయాలను తెరమీద చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో కిషోర్ పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు.
ఫస్ట్ హాఫ్ కథ, కథనాలు నెమ్మదిగా సాగుతూ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయి. కథలోని పాత్రలు, సన్నివేశాలతో ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే స్థాయి సీన్స్ లేకపోవటం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. కిషోర్ తిరుమల దర్శకుడిగా తడబడినా.. రచయితగా మాత్రం సక్సెస్ అయ్యాడు. కొన్ని డైలాగ్స్ గుర్తిండి పోయేలా ఉన్నాయి. వరసగా ఫెయిల్ అవుతున్న సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమా స్థాయికి తగ్గ సంగీతాన్ని అందించి పరవాలేదనిపించాడు. రెండు పాటలు, సంగీతం బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
సాయి ధరమ్ తేజ్
డైలాగ్స్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్
క్యారెక్టరైజేషన్స్
Read Also : Google Payతో బంగారం కొనొచ్చు..అమ్మొచ్చు