Game Changer : ‘గేమ్ ఛేంజర్’ చిత్ర యూనిట్ పిర్యాదు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు..
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విషయంలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎందుకో తెలుసా..?

Ciber crime police arrest two people on complaint from Ram Charan Game Changer producers
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంటే శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్, నవీన్ చంద్ర.. తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న 50వ సినిమా కావడంతో ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని నిర్మిస్తున్నారు.
దీంతో ఈ మూవీ నిర్మాణ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ మూవీ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ అవుతూ వస్తున్నాయి. అలా లీకైన వాటిని సోషల్ మీడియాలో వైరల్ అవ్వకుండా చిత్ర యూనిట్ తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కి ముందే లీక్ అవ్వడం పై చిత్ర నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read : Rashmika Mandanna : మార్ఫింగ్ వీడియో పై రష్మిక రియాక్షన్.. చదువుతున్న టైంలో ఇలా జరిగితే..
మూవీలో ‘జరగండి’ పాటని మేకర్స్ రిలీజ్ చేయడానికంటే ముందే ఎవరో లీక్ చేసేశారు. ఇక దీనిని సీరియస్ గా తీసుకున్న దిల్ రాజు.. లీగల్ గా యాక్షన్ తీసుకున్నారు. ఇక నిర్మాత ఇచ్చిన కేసు నమోదు చేసిన పోలీసులు ఆ సాంగ్ లీక్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ లీక్ విషయంలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలియజేశారు. వారిని అదుపులోకి తీసుకోని పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్లు తెలియజేశారు.
ఇక ఈ ‘జరగండి’ సాంగ్ ని అఫీషియల్ గా దీపావళి నాడు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. లీకైన పాటకి ఆడియన్స్ నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. దీంతో ఒరిజినల్ సాంగ్ పై భారీ హైప్ నెలకుంది. రిలీజ్ తరువాత యూట్యూబ్ రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం అంటున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటకి ప్రభుదేవ డాన్స్ కోరియోగ్రఫీ చేసినట్లు సమాచారం.