‘మోడీజీ మీ విజన్ విఫలమైంది’…ప్రధానికి కమల్ హాసన్ లేఖ
కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తప్పుబట్టాడు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు.

కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తప్పుబట్టాడు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు.
కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తప్పుబట్టాడు. ఈమేరకు ఆయన సోమవారం (ఏప్రిల్ 6, 2020) ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా మూడు వారాలపాటు విధించిన లాక్ డౌన్ అమలు లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. సార్ ఈసారి మీ విజన్ విఫలమైంది అని మోడీని ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు. ప్రణాళికాబద్దంగా లాక్ డౌన్ ప్రకటించని లోపానికి సాధారణ ప్రజలను తప్పుపట్టలేమన్నారు. మహమ్మారిని నియంత్రించేందుకు ప్రణాళిక, కసరత్తు లేకుండా నోట్ల రద్దు మాదిరిగానే లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని నిర్ణయం సరికాదని చెప్పారు.
దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను కేవలం 4 గంటల వ్యవధిలో లాక్ డౌన్ కు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగు నెలల ముందే కరోనా వైరస్ సమాచారం ఉన్నా 4 గంటల నోటీసుతోనే ప్రజలకు లాక్ డౌన్ ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు. నోట్ల రద్దు లాగే మరో తప్పిదం జరుగుతుందేమోనన్న భయం తనను వెంటాడుతోందన్నారు. లాక్ డౌన్ ప్రకటించిన మరుసటి రోజు కమల్ హాసన్…ప్రధానికి రాసిన లేఖలోనూ పలు విషయాలను ప్రస్తావించడం గమనార్హం. (ఇటలీ విరాళంగా ఇచ్చిన PPEలను తిరిగి ఆ దేశానికే విక్రయించిన చైనా)
కరోనా వైరస్ అధిక ఇబ్బందులు ఎదుర్కొనే అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకునే చర్యలను ప్రకటించాలని కమల్ హాసన్ కోరారు. ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాల కోసం కాకుండా అణగారిన వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవాలని అన్నారు. పునాదులు దెబ్బతింటే అద్భుతమైన నిర్మాణాలు కూడా నేల మట్టం అవుతాయని తెలిపారు. దేశంలోని ఏ ఒక్కరు కూడా ఆహారం లేకుండా నిద్రించే దుస్థితి రాకూడదని చెప్పారు.