Cinema Bandi : గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన ‘సినిమా బండి’ దర్శకుడు..

53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలు గోవాలో ఘనంగా మొదలయ్యాయి. ఈ నెల 20న మొదలయిన ఈ వేడుకలు 28 వరకు కొనసాగాయి. ఇక విషయానికి వస్తే 2021లో ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ లో విడుదలయిన కామెడీ డ్రామా చిత్రం 'సినిమా బండి' దర్శకుడు గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటాడు.

Cinema Bandi : గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన ‘సినిమా బండి’ దర్శకుడు..

Cinema Bandi Director win Best Debut Director Award at Goa Film Festival

Updated On : November 29, 2022 / 11:34 AM IST

Cinema Bandi : 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలు గోవాలో ఘనంగా మొదలయ్యాయి. ఈ నెల 20న మొదలయిన ఈ వేడుకలు 28 వరకు కొనసాగాయి. ఇక ఈ వేడుకలకు టాలీవుడ్ లోని దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యి సందడి చేశారు. అలాగే ఈ ఏడాదికి గాను మెగాస్టార్ చిరంజీవిని భారత్ ప్రభుత్వం ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది.

Kashmir Files : గోవా ఫిలిం ఫెస్టివల్ వేదికపై కశ్మీర్ ఫైల్స్ వివాదం.. IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిద్ పై దేశవ్యాప్తంగా విమర్శలు..

ఇక విషయానికి వస్తే 2021లో ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ లో విడుదలయిన కామెడీ డ్రామా చిత్రం ‘సినిమా బండి’ దర్శకుడు గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటాడు. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక కొత్త కథతో, కొత్త నటీనటులతో అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. కెమెరా దొరికిన ఒక పల్లెటూరు కుర్రాడు, తన గ్రామస్తుల సహాయంతో ఎలా సినిమా తీశాడు అనేది చాలా చక్కగా చూపించాడు దర్శకుడు.

కాగా 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలో స్పెషల్ మెన్షన్ అవార్డు జాబితాలో బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ గా ‘ప్రవీణ్ కాండ్రేగుల’ అవార్డుని అందుకున్నాడు. ఇక ఇదే ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ పనోరమా విభాగంలో సినిమా బండితో పాటు బాలకృష్ణ – అఖండ, అడవి శేషు – మేజర్ సినిమాలను ప్రదర్శించారు.