Cinema Chettu : మళ్ళీ జీవం పోసుకుంటున్న ‘సినిమా చెట్టు’.. పాత రోజులు వస్తాయా?
ఆ చెట్టు గోదావరి ఒడ్డున ఎంతో మందికి నీడ ఇవ్వడమే కాకుండా అనేక సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయింది.(Cinema Chettu)

Image Credits : G Biinduu Varma Instagram
Cinema Chettu : గోదావరి జిల్లాల్లో ఉన్న కొవ్వూరు మండలం తాళ్ళపూడి దగ్గర్లోని కుమారదేవం గ్రామంలో ఒక పెద్ద నిద్ర గన్నేరు చెట్టు ఉంది. శ్రీ సింగలూరి తాతబ్బాయి అనే ఆయన 145 ఏళ్ళ క్రితం ఆ చెట్టుని నాటారు. అది పెద్దయి మహా వృక్షం అయిన తర్వాత ఆ చెట్టు గోదావరి ఒడ్డున ఎంతో మందికి నీడ ఇవ్వడమే కాకుండా అనేక సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయింది.
అప్పట్లో ఆ చెట్టు దగ్గర ఎన్నో సినిమాలు షూటింగ్స్ జరిగేవి. పాడిపంటలు, దేవత, వంశవృక్షం, బొబ్బిలిరాజా, హిమ్మత్ వాలా, సీతారామయ్యగారి మనవరాలు, లేడీస్ టైలర్.. ఇలా దాదాపు వందకు పైగా సినిమాలు ఆ చెట్టు కింద షూటింగ్ చేశాయి, ఆ చెట్టుతో షూటింగ్ చేశాయి. దీంతో దానికి సినిమా చెట్టు అనే పేరు వచ్చింది.
Also See : Parvati Melton : ప్రగ్నెంట్ అయిన జల్సా హీరోయిన్.. పార్వతి మెల్టన్ బేబీ బంప్ ఫొటోలు వైరల్..
అయితే గత సంవత్సరం వచ్చిన గోదావరి వరదలకు ఆ చెట్టు కూలిపోయింది. 145 ఏళ్లుగా ఎన్నో వరదల్నీ తుఫాన్లనీ తట్టుకొని నిలబడిన ఈ చెట్టు గోదావరి వరదలకు పడిపోవడంతో ఆ గ్రామ ప్రజలు, ఆ చెట్టుతో అనుబంధం ఉన్న వారంతా ఎమోషనల్ అయ్యారు. ఇక సినిమా వాళ్లు అక్కడికి రారు, షూటింగ్స్ చేయరు అని అంతా అనుకున్నారు.
అయితే వరదల్లో చెట్టు కూలిపోవడంతో మళ్ళీ ఆ చెట్టుకు పునర్జీవం ఇవ్వాలని రాజమండ్రి రోటరీ క్లబ్ ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ చెట్టుని మళ్ళీ పెంచాలని ప్రయత్నాలు చేసింది. దీంతో ఇన్ని రోజులకు ఆ ప్రయత్నాలు ఫలించి ఇప్పుడు ఆ చెట్టు చిగురిస్తుంది. దీంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే రక్షిస్తే కొన్ని ఏళ్లలో చెట్టు పెద్దదయి నీడని ఇవ్వడమే కాకుండా మరోసారి సినిమా షూటింగ్స్ జరగాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. మరి భవిష్యత్తులో మళ్ళీ సినిమా చెట్టు దగ్గర సినిమా షూటింగ్స్ జరుగుతాయా వేచి చూడాలి.
Also See : Pawan Kalyan Rare Photos : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. పవన్ రేర్ ఫొటోలు చూశారా..?