Parvati Melton : పెళ్లయిన 13 ఏళ్ళ తర్వాత ప్రగ్నెంట్.. జల్సా హీరోయిన్ బేబీ బంప్ ఫోటోలు వైరల్..
జల్సా సినిమాలో ఇలియానా తో పాటు ఉన్న ఇంకో హీరోయిన్ పార్వతి మెల్టన్ గుర్తుందా.. తాజాగా పార్వతి మెల్టన్ తన బేబీ బంప్ ఫోటోలను(Parvati Melton)

Parvati Melton
Parvati Melton : జల్సా సినిమాలో ఇలియానా తో పాటు ఉన్న ఇంకో హీరోయిన్ పార్వతి మెల్టన్ గుర్తుందా.. అమెరికాలో పుట్టిన ఇండియా సంతతికి చెందిన అమ్మాయి పార్వతి మెల్టన్. వెన్నెల సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మెప్పించింది. అనంతరం గేమ్, మధుమాసం, జల్సా , అల్లరి అల్లరి, దూకుడు.. ఇలా పలు సినిమాలు నటించింది. మలయాళం, హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసింది.(Parvati Melton)
చివరగా పార్వతి మెల్టన్ 2012 లో తెలుగులో యమహో యమ అనే సినిమా చేసింది. అదే సంవత్సరం అమెరికాలో ఉన్న బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపొయింది. అప్పట్నుంచి సినిమాలు మానేసింది. సినిమాలు మానేసినా అక్కడ బిజినెస్ లు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది.
Also See : Pawan Kalyan Rare Photos : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. పవన్ రేర్ ఫొటోలు చూశారా..?
తాజాగా పార్వతి మెల్టన్ తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పార్వతి మెల్టన్ కి కాబోయే మామ్ అంటూ అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram