Cinematograph (Amendment) Bill 2023 : సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023.. ఫుల్ డీటెయిల్స్.. ఇకపై మరిన్ని సెన్సార్ సర్టిఫికెట్స్..

తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. సినిమాటోగ్రఫీ 1952 బిల్ కు కొన్ని సవరణలు చేస్తూ అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో ఈ బిల్ ప్రవేశపెట్టగా అక్కడ పాస్ అయి అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది.

Cinematograph (Amendment) Bill 2023 : సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023.. ఫుల్ డీటెయిల్స్.. ఇకపై మరిన్ని సెన్సార్ సర్టిఫికెట్స్..

Cinematography (Amendment) Bill 2023 Full Details about Piracy and Censor Certification

Updated On : July 29, 2023 / 5:06 PM IST

Cinematograph (Amendment) Bill 2023 : ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కొత్త బిల్లుల్ని ప్రవేశపెడుతున్నారు. తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. సినిమాటోగ్రఫీ 1952 బిల్ కు కొన్ని సవరణలు చేస్తూ అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో ఈ బిల్ ప్రవేశపెట్టగా అక్కడ పాస్ అయి అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది. ఈ బిల్ లో పలు అంశాలు ఉండగా ముఖ్యంగా పైరసీ, సెన్సార్ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

తాజాగా సవరించిన సినిమాటోగ్రఫీ బిల్ ప్రకారం ఇకపై సినిమాని పైరసీ చేసినా, సినిమాని థియేటర్స్ లో రికార్డ్ చేసినా మూడేళ్ళ జైలు శిక్షతో పాటు, ఆ సినిమా ప్రొడక్షన్ ఖర్చులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ రూల్ ని చాలా కఠినతరంగా అమలు చేయనున్నారు.

అలాగే.. ఇప్పటివరకు సెన్సార్ బోర్డు సినిమాలకు నాలుగు రకాల సెన్సార్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. తాజాగా వీటిని మరో మూడింటికి పెంచారు. క్లీన్ U, U/A, A , S సర్టిఫికెట్స్ ప్రస్తుతం ఇస్తుండగా ఇప్పుడు తాజాగా U/A లోనే మరో మూడు సర్టిఫికెట్లు తీసుకొచ్చారు. UA 7+, UA 13+, UA 16+ సర్టిఫికెట్స్ ఇవ్వనున్నారు. ఇవి ఆ ఏజ్ లోపు ఉన్నవాళ్లు పేరెంట్స్ పర్యవేక్షణలో మాత్రమే చూడాలి. సినిమాలో వైలెన్స్, సెక్సువల్ కంటెంట్ ఆధారంగా ఈ సర్టిఫికెట్స్ ని జారీ చేయనున్నారు.

Cinematograph (Amendment) Bill 2023 : సినిమా పైరసీ బిల్ పాస్ చేసిన రాజ్యసభ.. ఇకపై సినిమా పైరసీ చేస్తే 3 ఏళ్ళు జైలుతో పాటు భారీ జరిమానా..

అలాగే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే CBFC (Central Board of Film Certification) కి పూర్తి అధికారాలు కలిపించి సినిమాకు తగ్గట్టు, సినిమా ప్రసార మాధ్యమాన్ని తగ్గట్టు సర్టిఫికెట్ ఇచ్చేలా ఒక అటానమస్ సంస్థలా విధులు నిర్వహించేలా చేశారు.