Citadel star Samantha posts Myositis treatment is difficult
Samantha : స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది మయోసైటిస్ (Myositis) అనే వ్యాధి భారిన పడినట్లు తెలియజేసిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు అసలు బయటికి రాని సమంత ఈ మధ్య కాలంలోనే షూటింగ్స్ అండ్ ప్రమోషన్స్ అంటూ ఆడియన్స్ ముందుకు వస్తుంది. దీంతో ఆమె ఆరోగ్యం బాగైందని అందరూ అనుకున్నారు. తను ఒకే చేసిన సినిమాలకు కోసం జిమ్ లో కసరత్తులు, గుర్వపు స్వారిలో చేస్తుంటే సామ్ అభిమానులు ఆమెను మళ్ళీ ఆలా హుషారుగా చూసి ఖుషీ ఫీల్ అయ్యారు.
Samantha: గుడి ఓకే.. ఆ విగ్రహం ఏమిటి.. అంటూ ఫైర్ అవుతున్న సమంత ఫ్యాన్స్!
అయితే సమంత ట్రీట్మెంట్ మాత్రం ఇంకా పూర్తి అవ్వలేదట. మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు ట్రీట్మెంట్ తీసుకుంటూనే సినిమా నిర్మాతలు కోసం షూటింగ్స్ కూడా హాజరవుతూ వస్తుంది. ఇటీవల ఆక్సిజన్ మాస్క్ పిక్ తో ఉన్న ఒక పిక్ ని షేర్ చేసి హైపర్బేరిక్ థెరపీ (Hyperbaric Oxygen Therapy) తీసుకుంటున్నట్లు తెలిపింది. కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్, పాడైన కండరాలను బాగుచేయడంలో హైపర్బేరిక్ థెరఫీ కాపాడుతుందని వెల్లడించింది. తాజాగా ఐస్ బాత్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలియజేసింది.
Samantha : పర్సనల్ ఫీలింగ్స్ ని యాడ్స్ లో పెట్టిందా?? ఆ విషయంలో సమంతనే ఫస్ట్..
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఫోటో షేర్ చేసింది. ఆ ఫొటోలో సమంత ఐస్ క్యూబ్స్ ఉన్న టబ్ కూర్చొని కనిపిస్తుంది. ఈ ట్రీట్మెంట్ నరకంగా ఉంది అంటూ కామెంట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన సామ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) ఖుషీ (Kushi) సినిమా, ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ తో సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఖుషీలో రొమాంటిక్ రోల్ లో కనిపిస్తుండగా, సిటాడెల్ స్పై పాత్రలో యాక్షన్ ఫైట్స్ తో అదరగొట్టబోతుంది.
Citadel star Samantha posts Myositis treatment is difficult