Samantha: గుడి ఓకే.. ఆ విగ్రహం ఏమిటి.. అంటూ ఫైర్ అవుతున్న సమంత ఫ్యాన్స్!

స్టార్ హీరోయిన్ సమంతపై అభిమానంతో ఓ వీరాభిమాని ఆమె కోసం ఏకంగా ఓ గుడిని కట్టేశాడు.

Samantha: గుడి ఓకే.. ఆ విగ్రహం ఏమిటి.. అంటూ ఫైర్ అవుతున్న సమంత ఫ్యాన్స్!

Samantha Fans Angry On Her Idol In The Temple

Samantha: స్టార్ బ్యూటీ సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీపై అభిమానాన్ని తమదైన పద్ధతిలో చూపిస్తుంటారు ఆమె అభిమానులు. తాజాగా ఓ అభిమాని సమంతపై తన అభిమానాన్ని చాటుకున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో సందీప్ అనే వీరాభిమాని సమంత కోసం ఏకంగా ఓ గుడిని కట్టేశాడు.

Samantha : సమంతకు గుడి కడుతున్న వీరాభిమాని.. బర్త్ డే రోజు ఓపెనింగ్!

బాపట్ల జిల్లా చండూరు మండలం అలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని. ఆమె సినిమాలను చూస్తూ సమంతకు ఫ్యాన్‌గా మారిన సందీప్, ఆమె చేసే సామాజిక సేవతో వీరాభిమానిగా మారాడు. ప్రత్యూష ఫౌండేషన్ తరపున సమంత చేస్తున్న సేవలతో ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయి. దీంతో సమంతపై సందీప్‌కు మరింత అభిమానం పెరిగింది. ఈ క్రమంలోనే సమంతకు ఓ గుడి కట్టించాలని రెండేళ్ల కిందటే ఈ అభిమాని నిర్ణయం తీసుకుని.. ఎట్టకేలకు నిన్న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆ గుడిని ప్రారంభించాడు. తన ఇంటి ఆవరణలో ఓ చిన్న గుడి కట్టి సమంత విగ్రహాన్ని అందులో పెట్టాడు.

Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత.. మళ్లీ ఏమైంది?

అయితే, సందీప్ గుడి కట్టిన విషయంలో సమంత ఫ్యాన్స్ అతడిని మెచ్చుకుంటున్నా.. ఆ గుడిలో అతడు ఏర్పాటు చేసిన విగ్రహం చూసి వారు అతడిపై మండిపడుతున్నారు. సమంత లాంటి బ్యూటీ విగ్రహాన్ని సరిగా చేసి ఉంటే బాగుండేదని.. ఆమె విగ్రహం అందంగా లేదని పలువురు నెటిజన్లు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఖుష్బు, హన్సికల తరువాత అభిమానితో గుడి కట్టించుకున్న ఘనత సమంత సొంతం చేసుకోవడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.