Samantha : పర్సనల్ ఫీలింగ్స్ ని యాడ్స్ లో పెట్టిందా?? ఆ విషయంలో సమంతనే ఫస్ట్..

వరసగా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సమంత మరో వైపు యాడ్స్ తో కూడా ఫుల్ బిజీ అయిపోతోది. యాడ్స్ అంటే ఏదో చీరలు, నగలు, షాపింగుల గురించి కాదు ఇప్పటి వరకూ స్టార్ హీరోలు మాత్రమే చేసిన కూల్ డ్రింక్ యాడ్.

Samantha : పర్సనల్ ఫీలింగ్స్ ని యాడ్స్ లో పెట్టిందా?? ఆ విషయంలో సమంతనే ఫస్ట్..

Samantha dialogues in recent Ad goes viral

Samantha :  సౌత్ టూ నార్త్ ప్రజెంట్ సెన్సేషన్ సమంత(Samantha). సౌత్(South) లో ఇంత హ్యూజ్ క్రేజ్, ఇమేజ్ తో పాటు నార్త్(North) లో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే రేంజ్ కంటిన్యూ చేస్తోంది. ఇటీవల నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన సమంత ఇంటర్నేషనల్ మూవీస్ ని టార్గెట్ పెట్టుకుంది. లేటెస్ట్ గా మరో క్రేజీ ఫీట్ సాధించింది సమంత. ఇప్పటి వరకూ స్టార్ హీరోలకు మాత్రమే సొంతమైన టాప్ కూల్ డ్రింక్(Cool Drink) యాడ్ చేసి సౌత్ ఇండియా లోనే ఫస్ట్ హీరోయిన్ గా ట్రెండ్ చేసింది.

వరసగా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సమంత మరో వైపు యాడ్స్ తో కూడా ఫుల్ బిజీ అయిపోతోది. యాడ్స్ అంటే ఏదో చీరలు, నగలు, షాపింగుల గురించి కాదు ఇప్పటి వరకూ స్టార్ హీరోలు మాత్రమే చేసిన కూల్ డ్రింక్ యాడ్. పెప్సీ కూల్ డ్రింక్ యాడ్ కి సంబందించి సమంత బ్రాండ్ అంబాసిడర్ గా సెలక్ట్ అయ్యింది. దీనికి సంబందించి సమంత యాడ్ కూడా అంతే బోల్డ్ గా చేసింది.

పర్సనల్ గా ప్రొఫెషనల్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ స్టేట్ మెంట్స్ ఇచ్చే సమంత ఈ యాడ్ లో తన సొంత ఫీలింగ్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. చైతూతో విడిపోయిన దగ్గర్నుంచి ఎప్పటికప్పుడు నా లైఫ్ నా ఇష్టం అన్నట్టు కొటేషన్స్ పోస్ట్ చేస్తోంది. ఇప్పుడు ఈ యాడ్ లో కూడా సమంత ఫీలింగ్స్.. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, లోకం మాటల్ని పట్టించుకోకు అంటూ స్టేట్ మెంట్స్ ఇస్తోంది. ఎదుగుతున్న కొద్దీ నిన్ను కిందకు లాగాలని అందరూ చూస్తూనే ఉంటారు, వాళ్లందరినీ దాటుకుని నువ్వు పైకి రావాలి అంటూ మనసులో మాటల్ని యాడ్స్ ద్వారా చెబుతోంది. ఈ యాడ్ చుసిన వాళ్లంతా ఆయా డైరెక్టర్ కి చెప్పి నువ్వే రాశావా డైలాగ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Mrunal Thakur : బ్లాక్ డ్రెస్ లో హాట్ పోజులిస్తున్న మృణాల్ ఠాకూర్..

ఇటీవల సో కాల్డ్ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా పవర్ ఫుల్ రోల్స్ చేయడానికి ట్రై చేస్తున్న సమంత యాడ్స్ విషయంలో కూడా అంతే పవర్ ఫుల్ గా కనిపించాలనుకునేఉంది. విమెన్ సెంట్రిక్ రోల్స్ తో దూసుకుపోతున్న సమంత తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సినిమాలతో బిజీగా ఉంది. వీటితో పాటు ఇప్పుడు సౌత్ ఇండియా లోనే ఏ హీరోయిన్ కి దొరకని పెప్సీ కూల్ డ్రింక్ యాడ్ చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. అదికూడా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తూ రైజ్ అప్ బేబీ అంటున్న సమంత తన లైఫ్ లో కూడా ఇదే రూల్ ని ఫాలో అవుతోంది.