శంషాబాద్‌లో హాలీవుడ్ రేంజ్‌లో అతిపెద్ద స్టూడియో – చిరంజీవితో కేసీఆర్ సంప్రదింపులు అందుకే!

శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోని వందలాది ఎకరాల్లో అత్యద్భుతంగా సినీ నగరిని నిర్మించే దిశగా తెలంగాణా ప్రభుత్వం అడుగులు వేస్తుంది..

  • Published By: sekhar ,Published On : February 8, 2020 / 10:02 AM IST
శంషాబాద్‌లో హాలీవుడ్ రేంజ్‌లో అతిపెద్ద స్టూడియో – చిరంజీవితో కేసీఆర్ సంప్రదింపులు అందుకే!

Updated On : February 8, 2020 / 10:02 AM IST

శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోని వందలాది ఎకరాల్లో అత్యద్భుతంగా సినీ నగరిని నిర్మించే దిశగా తెలంగాణా ప్రభుత్వం అడుగులు వేస్తుంది..

తెలుగు చలనచిత్ర పరిశ్రమ.. ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత చిత్ర పరిశ్రమలోనూ మార్పులు చోటు చేసుకుంటాయని, ఇండస్ట్రీ వైజాగ్‌కి తరలి వెళ్లిపోతుందని గతకొంత కాలంగా ఫిలింనగర్‌లో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పరిశ్రమకు తగినంత ప్రాధాన్యత కలిపిస్తామని హామీ ఇవ్వడం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,  చిరంజీవి, అక్కినేని నాగార్జునలతో ప్రత్యేకంగా సమావేశమవడం చర్చనీయాంశంగా మారింది.

సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అందజేత, థియేటర్ల కొరత, ఆన్ లైన్ టికెటింగ్ విధానం, షూటింగ్ పర్మిషన్లతో సహా లోకేషన్లలో మహిళల భద్రతపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా శంషాబాద్‌లో సినీ హబ్ ఏర్పాటుకానుందనే వార్త పరిశ్రమ వర్గాల్లో వినబడుతోంది. హాలీవుడ్ స్థాయిలో భారీ స్టూడియో రూపొందనుందని, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోని వందలాది ఎకరాల్లో అత్యద్భుతంగా సినీ నగరిని నిర్మించే దిశగా తెలంగాణా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
 

తాజాగా జరిగిన ఈ భేటిపై చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా పలువురు సినీ పెద్దల నుంచి ప్రధాన సమస్యలను గుర్తించిన ప్రభుత్వం వాటి పరిష్కారానికి ముందడుగు వేయబోతుంది. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు తలసాని ఫిబ్రవరి రెండో వారంలో మరోమారు చిరంజీవితో భేటీ కానున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలాఖరులో సినీ ప్రముఖులతో సమావేశమవనున్నారని తెలుస్తోంది.