Jana Nayakudu: సంక్రాంతి బరిలో ‘జన నాయకుడు’.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
తమిళ స్టార్ విజయ్ దళపతి హీరోగా వస్తున్న మూవీ జన నాయగన్. తెలుగులో ఈ సినిమా జన నాయకుడు(Jana Nayakudu) పేరుతో విడుదల కానుంది. తే;తెలుగులో సూపర్ హిట్ అయిన భగవంత్ కేసరి సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది.
Vijay 'Jana Nayakudu' movie releasing for 2026 Sankranti
Jana Nayakudu: తమిళ స్టార్ విజయ్ దళపతి హీరోగా వస్తున్న మూవీ జన నాయగన్. తెలుగులో ఈ సినిమా జన నాయకుడు పేరుతో విడుదల కానుంది. తే;తెలుగులో సూపర్ హిట్ అయిన భగవంత్ కేసరి సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఖాకీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు హెచ్.వినోద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విజయ్ కెరీర్ లో చివరి చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే, (Jana Nayakudu)ఈ సినిమా చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కొంతకాలం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన ప్రాజెక్టు రీసెంట్ గా మళ్ళీ స్టార్ట్ అయ్యింది.
Anupama Parameswaran: వయ్యారి భామ అనుపమ.. ఇంత అందం ఏంటమ్మా.. ఫోటోలు
దీంతో విడుదల తేదీని ప్రకటిస్తూ అధికారిక పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. జనాల మధ్య నుంచి నడుచుకుంటూ వస్తున్న జన నాయకుడిగా ఈ పోస్టర్ ను సెట్ చేశారు. ఇక ముందుగా అనుకున్నట్టుగానే సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా ప్రకటించారు. దీంతో, విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పూజ హేగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ కూడా రానుంది.
