‘కోకోకోలా పెప్సీ.. మామా అల్లుడు సెక్సీ’

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య మామా అల్లుళ్లుగా నటించిన ‘వెంకీ మామ’ సినిమాలోని ‘కోకోకోలా పెప్సీ’ లిరికల్ సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : December 4, 2019 / 11:13 AM IST
‘కోకోకోలా పెప్సీ.. మామా అల్లుడు సెక్సీ’

Updated On : December 4, 2019 / 11:13 AM IST

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య మామా అల్లుళ్లుగా నటించిన ‘వెంకీ మామ’ సినిమాలోని ‘కోకోకోలా పెప్సీ’ లిరికల్ సాంగ్ రిలీజ్..

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన సినిమా.. ‘వెంకీ మామ’.. వెంకీతో పాయల్ రాజ్‌పుత్, చైతుతో రాశీఖన్నా జతకడుతున్నారు. బుధవారం సాయంత్రం ‘కోకోకోలా పెప్సీ’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Image

తమన్ ట్యూన్ కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. అతిథి భవరాజు, రమ్యా బెహ్రా, సింహా, హనుమాన్ పాడారు. వెంకీ, చైతు ఇద్దర్నీ ఈ పాటలో కలర్ ఫుల్‌గా చూడడం దగ్గుబాటి, అక్కినేని అభిమానులకు పండగనే చెప్పాలి.

Image

వెంకీ, పాయల్, చైతు, రాశీల కెమిస్ట్రీ బాగుంది. కలర్ ఫుల్ సెట్‌లో తెరకెక్కించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని మూవీ టీమ్ చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వెంకీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న ‘వెంకీమామ’ భారీ స్థాయిలో విడుదల కానుంది..