Ustad Bhagat Singh: ‘కాలరే ఎత్తరా’ సాంగ్ వచ్చేసింది.. మాస్ డాన్స్ తో అదరగోట్టేసిన పవన్ కళ్యాణ్

ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) నుంచి 'కాలరే ఎత్తరా' సాంగ్ విడుదల అయ్యింది.

coller ye yetthara song out now from ustaad bhagath singh

Ustad Bhagat Singh; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)’ నుంచి ‘కాలరే ఎత్తరా’ అనే సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. మాస్ బీట్ తో వచ్చిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. పాటలో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు చూస్తుంటే ఫ్యాన్స్‌కు పాత పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు. తనదైన మేనరిజంతో, ఈజ్ తో పవన్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ‘నెక్స్ట్ లెవల్’ అని చెప్పాలి.

Rashmika Mandanna: కావాలనే నాపై ద్వేషం పెంచుతున్నారు.. ఇక సహించేది లేదు.. కఠిన చర్యలు తప్పవు

ముఖ్యంగా ఆ గ్రేస్, ఎనర్జీకి మాస్ ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం. హరీష్ శంకర్ పవన్ బాడీ లాంగ్వేజ్‌ మరోసారి పర్ఫెక్ట్ గా వాడేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్ మాస్ బీట్‌తో దుమ్ములేపేశాడు. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న పాట కావడంతో.. ఈ పాటపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ట్యూన్ కంపోజ్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్.

ఇక కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ అదిరిపోయాయి. “కాలరే ఎత్తరా.. నీ సత్తా చూపరా” అంటూ సాగే లిరిక్స్ మోటివేషన్ ఇచ్చేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి, సినిమాలో ఆయన పోషిస్తున్న పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఈ లిరిక్స్ పక్కాగా సరిపోయాయి. దీంతో, ఈ సాంగ్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.