‘ఆహా’ లో త్వరలో ’కలర్ ఫొటో‘ మూవీ

  • Published By: sreehari ,Published On : September 6, 2020 / 08:31 PM IST
‘ఆహా’ లో త్వరలో ’కలర్ ఫొటో‘ మూవీ

Updated On : September 6, 2020 / 8:53 PM IST

color photo Movie: నటుడు సుహాస్, చాందినీ చౌదరిల కాంబినేషన్ లో కొత్త మూవీ ‘కలర్ ఫొటో’వస్తోంది. ఇప్పుడు ఈ మూవీని షార్ట్ ఫిలిమ్స్ తీసిన దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేయనున్నాడు.

ఈ లవ్ స్టోరీలో కమెడియన్ కమ్ హీరో సునీల్ విలన్ పాత్రలో కనిపించ నున్నారు. కొబ్బరిమట్ట నిర్మించిన సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పానేని నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ఆహా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా విడుదల కాబోతుంది.



చిన్న సినిమాల్లో కంటెంట్ ఉన్న మూవీలను చూసి అల్లు అరవింద్ కొనుగోలు చేస్తూ చిన్న దర్శకులను కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘కలర్ ఫోటో’ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది..



ఆ సినిమాను ఆహా కొనుగోలు చేసినట్లుగా సమాచారం.. ఈ సినిమాను దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆహా ప్లాన్ చేస్తుందని సమాచారం..