Colour Photo: రీ రిలీజ్ కి సిద్దమవుతున్న ఓటిటి బ్లాక్ బస్టర్..

ఈమధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల పాత సినిమాలను మళ్ళీ విడుదల చేసి అభిమానులు సందడి చేస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ 'పోకిరి'తో మొదలుపెట్టిన ఈ పద్థతిని మిగితా స్టార్ హీరోస్ అభిమానులు కూడా ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో చిన్న సినిమా కూడా రీ రిలీజ్ కు సిద్దమవుతుంది.

Colour Photo: రీ రిలీజ్ కి సిద్దమవుతున్న ఓటిటి బ్లాక్ బస్టర్..

Colour Photo Movie Re Release

Updated On : October 23, 2022 / 8:24 PM IST

Colour Photo: ఈమధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల పాత సినిమాలను మళ్ళీ విడుదల చేసి అభిమానులు సందడి చేస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ‘పోకిరి’తో మొదలుపెట్టిన ఈ పద్థతిని మిగితా స్టార్ హీరోస్ అభిమానులు కూడా ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. జల్సా, తమ్ముడు, ఘరానా మొగుడు, ఆది, చెన్నకేశవరెడ్డి, తాజాగా ప్రభాస్ బిల్లా వంటి సినిమాలు కూడా విడుదలయ్యి రీ రిలీజ్ లోను కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.

Colour Photo: నేషనల్ అవార్డ్ రావడంపై కలర్ ఫోటో టీమ్ ప్రెస్ మీట్

ఈ నేపథ్యంలోనే మరో చిన్న సినిమా కూడా రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. 2020 కోవిడ్ లాక్‌డౌన్‌ టైంలో విడుదలయ్యి, అందర్నీ ఆకట్టుకున్న “కలర్ ఫోటో” మరోసారి సినీప్రేమికలను అలరించబోతుంది. ఇటీవల 68వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు సినిమాగా అవార్డును కూడా గెలుచుకుంది. ఇప్పుడు, సినిమా విడుదలై 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకోవడంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

డైరెక్ట్ ఓటిటిలో విడుదలయిన ఈ చిత్రం నవంబర్ 19న, ఎటువంటి పోటీ లేనప్పుడు వెండితెరను పలకరించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. సందీప్ దర్శకత్వం వహించిన చిత్రంలో టాలీవుడ్ యాక్టర్స్ సునీల్, సుహాస్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించారు.