రూ.50 కోట్ల క్లబ్‌లో ‘కోమలి’

జయం రవి, కాజల్ అగర్వాల్, సంయుక్త హెగ్డే మెయిన్ లీడ్స్‌గా, ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో, వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కిన 'కోమలి' రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది..

  • Published By: sekhar ,Published On : September 27, 2019 / 09:48 AM IST
రూ.50 కోట్ల క్లబ్‌లో ‘కోమలి’

Updated On : September 27, 2019 / 9:48 AM IST

జయం రవి, కాజల్ అగర్వాల్, సంయుక్త హెగ్డే మెయిన్ లీడ్స్‌గా, ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో, వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘కోమలి’ రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది..

జయం రవి, కాజల్ అగర్వాల్, సంయుక్త హెగ్డే మెయిన్ లీడ్స్‌గా, ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో, వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై, ఇషారి కె.గణేష్ నిర్మాణంలో రూపొందిన తమిళ సినిమా ‘కోమలి’.. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న తమిళనాట గ్రాండ్‌గా రిలీజైన ‘కోమలి’ ప్రస్తుతం 7వ వారంలోకి అడుగు పెట్టింది.

రీసెంట్‌గా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. అనుకోకుండా 16 ఏళ్ల పాటు కోమాలో ఉన్న వ్యక్తి తిరిగి సృహలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే అంశాలతో కామెడీ హైలెట్‌గా తెరకెక్కిన ‘కోమలి’ తమిళ్‌లో సూపర్ హిట్ అయింది.

Read Also : ఫుల్ ఫన్నీగా హౌస్‌ఫుల్ 4 – ట్రైలర్..

జయం రవి రకరకాల గెటప్స్‌లో డిఫరెంట్‌గా కనిపించి తమిళ తంబీలను ఆకట్టుకున్నాడు. కోమలి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తన తనయుడు అర్జున్ కపూర్ హీరోగా  హిందీలో రీమేక్ చెయ్యనున్నారు.