Comedian Ali Reacts on Rajendra Prasad Comments
Comedian Ali : నిన్న ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అనుకోకుండా అలీని ఓ బూతుపదంతో ప్రస్తావించి మనం ఇలాగే మాట్లాడుకుంటాం కదా అని సరదాగా అన్నారు. కానీ స్టేజిపై అంతమంది నటీనటుల ముందు అలీని అలా బూతుపదంతో ప్రస్తావించడంతో ఆ కామెంట్స్ వైరల్ గా మారి, పలువురు రాజేంద్ర ప్రసాద్ ని విమర్శిస్తున్నారు
ఇప్పటికే దీనిపై రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ.. నేను ఇలాగే ఉంటాను. నా గురించి అందరికి తెలుసు. దాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటే అది మీ సంస్కారం అని నేడు ఉదయం ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడారు.
తాజాగా రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై అలీ స్పందించారు. ఈ మేరకు అలీ మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో అలీ మాట్లాడుతూ.. ఆయనకు అనుకోకుండా మాట దొర్లింది, ఆయన సరదాగానే అన్నారు. దీన్ని తీసుకొని పెద్ద వ్యవహారం చేస్తున్నారు. అయన మంచి ఆర్టిస్ట్. ఆయన దుఃఖంలో ఉన్నారు కొన్నాళ్ల నుంచి. ఆయన కూతురు ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరూ కూడా రచ్చ చేయకండి. ఆయన పెద్దాయన అని అన్నారు.
#RajendraPrasad గారికి అనుకోకుండా మాట తూలింది..
దయచేసి వైరల్ చేయకండి – #ALi pic.twitter.com/6DrSeL4mIH— Ramesh Pammy (@rameshpammy) June 2, 2025
Also Read : Nitya Shetty : ఇస్రోలో ఆఫర్.. ఇన్ఫోసిస్ లో జాబ్.. అన్ని వదిలేసి సినిమాల్లోకి.. దేవుళ్ళు పాప బ్యాక్ గ్రౌండ్..