Tamil Nadu : వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్

టాప్ కమెడియన్ తమిళంలో మయిల్ సామీ..టాప్ కమెడియన్ గా పేరు పొందారు. నూతన వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్ ను గిఫ్ట్ ఇచ్చి వార్తలో నిలిచారు.

Tamil Nadu : వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్

Tamil

Updated On : August 20, 2021 / 8:36 AM IST

Comedian Mayilsamy : ఓ ఇంట పెళ్లవుతోంది. పెళ్లి అనంతరం ఏర్పాటు చేసిన వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. పెళ్లికి వచ్చిన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కానుకలు అందిస్తున్నారు. కానీ..ఓ వ్యక్తి అందించిన కానుకను చూసి పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె షాక్ తిన్నారు. అక్కడున్న వారు కూడా ఇది చూసి అవాక్కయ్యారు. ఇలాగా కూడా ఎవరైనా గిఫ్ట్ ఇస్తారా ? అని నోరెళ్లబెట్టారు. అసలు ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చారు అని అనుకుంటున్నారా ? డబ్బాలో పోసిన పెట్రోల్ గిఫ్ట్ ఇచ్చారు.

Read More : Shravana Purnima And Raksha Bandhan : శ్రావణ పూర్ణిమ-రక్షా బంధనం

పెరిగిపోతున్న వస్తువుల రేట్లు చూసి గుండెలు గుభేల్ మంటున్నాయి. దీంతో కొందరు పెరిగిన వస్తువులను పలువురికి గిఫ్ట్ ఇస్తున్నారు. గతంలో ఉల్లిగడ్డల రేట్లు పెరిగితే…పెళ్లి కానుకగా..ఉల్లిగడ్డలను ఇవ్వడం, ఉల్లిగడ్డల దండాలు వేయడం వంటివి చూసిన సంగతి తెలిసిందే. తాజాగా పెట్రోల్ రేట్లు పెరగడంతో టాప్ కమెడియన్ నూతన వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్ ను గిఫ్ట్ ఇచ్చి వార్తలో నిలిచారు.

Read More : Gold Rate : పడిపోయిన బంగారం వెండి ధరలు

తమిళంలో మయిల్ సామీ..టాప్ కమెడియన్ గా పేరు పొందారు. చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించారు. ఈయన..ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్ పోసిన డబ్బాలను బహుమతిగా ఇచ్చారు. చిరునవ్వులు చిందిస్తూ..ఆయన ఇచ్చిన గిఫ్ట్ ను స్వీకరించారు. దీనికి సంబంధించిన ఫొటోను Manobala Vijayabalan ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసన వ్యక్తం చేయడం కోసమే…మయిల్ సామి అలా పెళ్లి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈయన రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. విరుగమ్ బక్కమ్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు.