Comedian Raghu : నేను, సీఎం రేవంత్ క్లాస్మెట్స్.. ఒకే బెంచ్.. కమెడియన్ కామెంట్స్ వైరల్..
తాజాగా కమెడియన్ రోలర్ రఘు సీఎం రేవంత్ నా క్లాస్ మెట్ అంటూ ఆసక్తికర విషయం తెలిపారు. (Comedian Raghu)
Comedian Raghu
చాలా మంది సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఒకప్పుడు కలిసి చదువుకున్న వాళ్లే. ముఖ్యంగా సినీ, రాజకీయ సెలబ్రిటీలు చిన్నప్పట్నుంచి తెలిసినవాళ్ళు, కలిసి పెరిగిన వాళ్ళు, కలిసి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలో పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు. తాజాగా కమెడియన్ రోలర్ రఘు సీఎం రేవంత్ నా క్లాస్ మెట్ అంటూ ఆసక్తికర విషయం తెలిపారు.
సినిమాల్లో కమెడియన్ గా ఫేమ్ తెచ్చుకున్న రఘు ఆ తర్వాత జబర్దస్త్ లో రోలర్ రఘుగా మంచి పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ తన సొంతూళ్లో బిజినెస్ చేసుకుంటున్నాడు.
Also Read : Thaman : తమన్ అన్న బంగారం.. 12 కోట్లతో ఓల్డ్ ఏజ్ హోమ్.. డొనేషన్స్ వచ్చినా నో చెప్పి..
తాజాగా రోలర్ రఘు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను, సీఎం రేవంత్ రెడ్డి, జెట్టి కుసుమ కుమార్(కాంగ్రెస్ నేత) ముగ్గురం కాలేజ్ మేట్స్. ఒకే క్లాస్, ఒకే బెంచ్ కూడా మేము. 1989, 90 ఆ సమయంలో దోమలగూడ AV కాలేజీలో కలిసి చదువుకున్నాం. కుసుమ కుమార్ నాకు బావ అవుతాడు. అప్పుడే వాళ్లిద్దరూ పొలిటికల్ గా తిరిగేవాళ్లు. నేను మాత్రం వాళ్ళతో పొలిటికల్ గా తిరగలేదు అని తెలిపాడు.
