మూడేళ్ల తర్వాత మేకప్.. మంచు మనోజ్ కొత్త సినిమా

  • Published By: vamsi ,Published On : February 13, 2020 / 04:48 AM IST
మూడేళ్ల తర్వాత మేకప్.. మంచు మనోజ్ కొత్త సినిమా

Updated On : February 13, 2020 / 4:48 AM IST

వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు కారణంగా మూడేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ ఎట్టకేలకు మళ్లీ సినిమా తీసేందుకు సిద్ధం అయ్యాడు. హీరో మంచు మనోజ్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అహం బ్రహ్మస్మి అనే సినిమాలో నటిస్తున్నట్లుగా నేడు(13 ఫిబ్రవరి 2020) ప్రకటించారు మంచు మనోజ్.

‘అహం బ్రహ్మస్మి’ అనే ఓ పవర్ ఫుల్ టైటిల్‌తో కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం మార్చి 6వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగనుంది. శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు.  మంచు మనోజ్ చివరి సినిమా ఒక్కడు మిగిలాడు 2017లో విడుదలైంది.

’అహం బ్రహ్మ అస్మి’ అంటే నేనే బ్రహ్మను అంటే నాలోనే ‘బ్రహ్మ’ ఉన్నాడని అర్థం. ఇంత క్లాసిక్ నేమ్ పెట్టుకున్నాడు అంటే కచ్చితంగా సినిమా క్లాసిక్‌గానే ఉంటుంది అని అంటున్నారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ‘మూడేళ్ల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. 

నా తొలి సినిమా ‘దొంగ దొంగది’కి ఎలాంటి ఎమోషన్‌కు లోనయ్యానో ఇప్పుడు అలానే ఫీల్‌ అవుతున్నాను. నా జీవితమైన నా కళను మిస్సయ్యాను. సినీ అమ్మ వచ్చేశా. లవ్‌ యూ డార్లింగ్స్‌’ అంటూ మనోజ్‌ ట్వీట్ చేశారు. విద్య నిర్వాణ మంచు ఆనంద్‌ సమర్పణలో సమర్పణలో సినిమా తెరకెక్కనుంది.