Pathaan : పఠాన్ సినిమాపై హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి పిర్యాదు..
పఠాన్ సినిమాపై రోజు రోజుకు వివాదం ముదురుతోంది. తాజాగా ఈ మూవీలోని ‘బేషరం రంగ్’ సాంగ్ ని తొలిగించేలా ఆదేశించాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ని కోరాడు ఆర్టీఐ కార్యకర్త డానిష్ ఖాన్. కాషాయ రంగుకు ముస్లిం సమాజంలో..

Complaint to Human Rights Commission on Pathaan movie
Pathaan : పఠాన్ సినిమాపై రోజు రోజుకు వివాదం ముదురుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రంలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక విడుదల దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ అండ్ సాంగ్స్ ని విడుదల చేస్తూ వస్తున్నారు.
Pathaan: కూతురితో కలిసి చూడాలంటూ షారూఖ్‌కు సవాల్ విసిరిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్
అయితే ఈ మూవీలోని ‘బేషరం రంగ్’ అనే సాంగ్ ని ఇటీవల విడుదల చేయగా, తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ పాటలోని దీపికా వస్త్రధారణ మరియు హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ అభ్యంతరకరంగా ఉందంటూ విమర్శలు ఎదురుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ముస్లిం సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తుండగా, తాజాగా హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి పిర్యాదు చేశాడు ఆర్టీఐ కార్యకర్త డానిష్ ఖాన్.
“కాషాయ రంగుకు ముస్లిం సమాజంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది ముస్లిం సమాజానికి చిస్తీ రంగు. పాట కూడా హిందూ, ముస్లింల ఐక్యత మరియు మనోభావాలను దెబ్బతీసేలా ఉంది” అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ పాటని సినిమా నుంచి తొలిగించేలా ఆదేశించాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ని కోరాడు. అయితే ఈ వివాదంపై ఇప్పటి వరకు మూవీ టీమ్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.