Evaru Meelo Koteeswarulu: నీకంటే కంప్యూటర్ బెటర్.. మహేష్-తారక్ ఫన్నీ ప్రోమో!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఒకవైపు..

Evaru Meelo Koteeswarulu: నీకంటే కంప్యూటర్ బెటర్.. మహేష్-తారక్ ఫన్నీ ప్రోమో!

Evaru Meelo Koteeswarulu

Updated On : November 23, 2021 / 2:47 PM IST

Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఒకవైపు సామాన్య ప్రజల నుండి కంటెస్టెంట్లతో పాటు వరుసగా టాప్ స్టార్స్ తో కూడా ఎపిసోడ్స్ చేస్తూ షోను హైలెట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ముందుగా చరణ్ తోనే లాంచింగ్ ఈవెంట్ చేసిన తారక్ ఆ తర్వాత తారక్ అత్యంత సన్నిహితులైన దర్శకులు రాజమౌళి, కొరటాల శివలను కూడా తీసుకొచ్చాడు.

Nandini Rai : నాజూకు అందాల నందిని..

ఇక, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ షోకి గెస్ట్‌గా రాబోతున్నారనే వార్త కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. ఇద్దరూ షూటింగ్‌లో పాల్గొన్న పిక్ కూడా నెట్టింట వైరల్ అయ్యింది. దసరా లేదా దీపావళికి ఈ స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందన్నారు కానీ తర్వాత దీని గురించిన ఊసేలేదు. అయితే.. ఇప్పుడు ఈ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు షో నిర్వాహకులు. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం నుండి బ్లాక్ బస్టర్ ఎపిసొడ్ కి సంబంధించిన ప్రోమోను తాజాగా జెమిని టీవీ విడుదల చేసింది.

Allu Arjun : బుల్లితెరపై సందడి చేయనున్న ఐకాన్ స్టార్.. అభిమానులకి పండగే

సూపర్ స్టార్ మహేష్ డిఫరెంట్ స్టైల్ తో, స్మైల్ తో షోలో సందడి చేసినట్లు ప్రోమోను చూస్తే తెలుస్తుండగా.. ఒక ప్రశ్నని ఇలా తిప్పి తిప్పి ఎందుకు అడగడం అని మహేష్ తారక్ ను ప్రశ్నించగా.. ఊరికే సరదాగా అని తారక్ జోక్ చేయడంతో.. బాబోయ్ నీకంటే కంప్యూటర్ గురువుగారే బెటర్ గా ఉన్నాడని మహేష్ టీజ్ చేయడం సరదాగా అనిపిస్తుంది. మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో ఉండటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసొడ్ ను ప్రసారం చేయనున్నారు. మరి ఎపిసోడ్ రిలీజ్ అయితే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో!