అబ్దుల్ కలాంగా అనిల్ కపూర్
గతకొంత కాలంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతుంది. మన టాలీవుడ్‌లో, మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి విజయంతో, బయోపిక్‌ల ట్రెండ్ ఊపందుకుంది.

గతకొంత కాలంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతుంది. మన టాలీవుడ్‌లో, మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి విజయంతో, బయోపిక్‌ల ట్రెండ్ ఊపందుకుంది.
గతకొంత కాలంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతుంది. మన టాలీవుడ్‌లో, మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి విజయంతో, బయోపిక్‌ల ట్రెండ్ ఊపందుకుంది. ప్రస్తుతం స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా రూపొందుతుంది.
వచ్చే ఏడాది బాలీవుడ్‌లో, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ రూపొందబోతుంది. అబ్దుల్ కలాం పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ నటించబోతున్నాడట. టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్‌తో కలిసి ఈ బయోపిక్‌ని రూపొందించబోతున్నాడు. వెపన్స్ ఆఫ్ పీస్ అనే బుక్ ఆధారంగ్, రాజ్ చెంగప్ప, కలాం బయోపిక్‌కి స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారు. డైరెక్టర్ ఎవరనేది కన్ఫమ్ కాలేదు.
నిర్మాతలు ఇప్పటికే అనిల్ కపూర్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే కలాం క్యారెక్టర్ అనిల్ కపూర్ చేస్తాడా, లేదా అనేది మాత్రం తెలియలేదు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్‌లో సినిమాని గ్రాండ్‌గా లాంచ్ చెయ్యడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.