మహర్షి సెకండ్ లుక్

నూతన సంవత్సరం సందర్భంగా మహర్షి సెకండ్ లుక్ రిలీజ్

  • Published By: sekhar ,Published On : December 31, 2018 / 01:12 PM IST
మహర్షి సెకండ్ లుక్

నూతన సంవత్సరం సందర్భంగా మహర్షి సెకండ్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా, మహర్షి.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో,  అశ్వినీ దత్, పీవీపీ, దిల్ రాజు నిర్మిస్తుండగా, అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్‌గా, పూజాహెగ్డే హీరోయిన్‌గా చేస్తుంది.
నూతన సంవత్సరం సందర్భంగా మహర్షి సెకండ్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఫస్ట్ లుక్‌లో చేతిలో బుక్‌తో కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించిన సూపర్ స్టార్, సెకండ్ లుక్‌లో సూటూ, బూటు గెటప్‌లో అదరగొట్టేసాడు. రెయిన్ ఎఫెక్ట్‌లో ఒక చేతిని పాకెట్‌లో పెట్టుకుని, గాగుల్స్‌తో, సూపర్ స్టార్ అలా స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్నాడు.

ఒక స్ట్రీట్‌లో ఆయన నడుస్తుండగా, వెనక ఇద్దరు విదేశీ అసిస్టెంట్స్ తన వెనకే ఫాలో అవుతుండగా, ఒకతను గొడుగు పట్టుకున్నాడు. మహేష్‌కి ముందు అవుట్ ఫోకస్‌లో కొంతమంది నడుస్తున్నారు. మొత్తానికి ఈ న్యూ లుక్‌లో మహేష్ చాలా బాగున్నాడనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్, స్టూడెంట్‌గా, రైతుగా, సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

ఈ లుక్ చూస్తుంటే, రిషి అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించడం ఖాయం అనిపిస్తుంది. జగపతి బాబు, జయసుధ, నవీన్ చంద్ర, సోనాల్ చౌహాన్ తదితరులు నటిస్తున్న మహర్షికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చుస్తున్నాడు. 2019 ఏప్రిల్‌లో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.