Most Expensive Phones : 2025లో వచ్చిన 5 అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు ఇవే.. హై-ఎండ్ కెమెరా ఫీచర్లు కేక.. ఏ ఫోన్ ధర ఎంతంటే?
Most Expensive Phones 2025 : ఈ ఏడాదిలో అద్భుతమైన స్పెషిఫికేషన్లతో అనేక ఫోన్లు లాంచ్ కాగా, అందులో టాప్ రేంజ్ కెమెరా సిస్టమ్‌తో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లపై ఓసారి లుక్కేయండి..

Most Expensive Phones : 2025 ముగుస్తోంది. ఈ ఏడాదిలో భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఆపిల్, శాంసంగ్, గూగుల్ వంటి వివిధ టాప్ బ్రాండ్ల నుంచి మల్టీఫుల్ ఫోన్‌లను చూశాం.. అయితే, ఈ ఏడాదిలో అత్యంత ఖరీదైన ఫోన్లు కూడా ఎక్కువగా అమ్ముడయ్యాయి.

ఇప్పటివరకూ మార్కెట్లో అత్యధిక స్థాయిలో హై-ఎండ్ ఫీచర్లతో అమ్ముడైన ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోవాలని ఉందా? ఏయే ఫోన్‌లు అత్యంత ఖరీదైనవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 1,29,999) : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ 7 మెయిన్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 15OS ఆధారంగా పనిచేస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ OISతో కూడిన 200MP ప్రైమరీ షూటర్‌తో సహా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (రూ. 1,49,900) : ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 3nm ప్రాసెస్ ఆధారంగా ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ ఐఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్, 48MP టెలిఫోటో సెన్సార్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ (రూ. 1,79,999) : గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ 8-అంగుళాల ఫోల్డబుల్ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్ 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. 6.4-అంగుళాల కవర్ డిస్‌ప్లే కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. గూగుల్ అందించే 7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది.

ఒప్పో ఫైండ్ X9 ప్రో (రూ. 109,999) : ఒప్పో ఫైండ్ X9 ప్రో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఏఆర్ఎమ్ G1-అల్ట్రా జీపీయూతో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్‌లో 200MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

వివో X300 ప్రో (రూ. 109,999) : వివో X300 ప్రో ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 200MP ప్రైమరీ షూటర్ ఉంటుంది. 3nm ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమన్షిటీ 9500 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ వివో ఫోన్ గ్యారెంటీ 5 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 16OSపై రన్ అవుతుంది. 90W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 6510mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది.
