జకార్తాలోని 7 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. గర్భిణి సహా 20 మంది సజీవ దహనం
ఇండొనేషియాలోని ఆ కార్యాలయం మైనింగ్ నుంచి వ్యవసాయం వరకు అన్ని రంగాల్లో క్లయింట్లకు వైమానిక సర్వే కార్యకలాపాల కోసం డ్రోన్ సేవలు అందిస్తుంది.
Jakart: ఇండొనేషియా రాజధాని జకార్తాలో ఓ కార్యాలయ భవనంలో అగ్నిప్రమాదంలో సంభవించి 20 మంది మృతి చెందారు. మరి కొందరు ఆ భవనంలోనే చిక్కుకుపోయారు.
మృతుల్లో ఐదుగురు పురుషులు, 15 మంది మహిళలు ఉన్నారు. మరణించిన వారిలో ఒక గర్భిణి కూడా ఉంది.
మంటలు ఏడు అంతస్తుల భవనం మొత్తం వ్యాపించాయని, గాలిలోకి దట్టమైన నల్ల పొగ ఎగిసిపడుతోందని పోలీసు అధికారులు చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల సెంట్రల్ జకార్తాలోని ప్రజలు భయాందోళనలు చెందారు.
స్థానిక కొంపాస్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. మంటలను ఆర్పేశారు కానీ, భవనంలో చిక్కుకున్నవారిని బయటకు తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఇండొనేషియాలోని ఆ కార్యాలయం మైనింగ్ నుంచి వ్యవసాయం వరకు అన్ని రంగాల్లో క్లయింట్లకు వైమానిక సర్వే కార్యకలాపాల కోసం డ్రోన్ సేవలు అందిస్తుంది.
“మొదటి అంతస్తులో ఒక బ్యాటరీకి మంటలు అంటుకున్నాయి. ఓ ఉద్యోగి దాన్ని ఆర్పే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత ఆ బ్యాటరీ మంట వ్యాపించి, చెలరేగింది. మొదటి అంతస్తును ఒక గోదాములా వాడుతున్నారు. అందుకే మంటలు త్వరగా చెలరేగాయి” అని అధికారులు వ్యాఖ్యానించారు.
BREAKING – Building fire kills 17 in Indonesia’s capital: police https://t.co/Y8o7lHbYo4 pic.twitter.com/7vKGSiUdTP
— Insider Paper (@TheInsiderPaper) December 9, 2025
