యాహూ : సినిమా టికెట్ల ధరలు తగ్గాయి
న్యూఇయర్‌లో సినీ ప్రియులకు గుడ్ న్యూస్. సినిమా టికెట్ ధరలు తగ్గాయి. 2019, జనవరి 1 మంగళవారం నుంచి మూవీ టికెట్ల ధరలు తగ్గాయి. పన్ను పోటు తగ్గడంతో ధరలు కూడా తగ్గాయి. 23 రకాల వస్తువులు, సేవలపై జీఎస్టీ తగ్గిస్తూ ఇటీవల జీఎస్టీ కౌనిల్స్ నిర్ణయం తీసుకుంది. రూ.100 పైబడి ఉన్న సినిమా టికెట్‌పై గతంలో 28శాతం ట్యాక్స్ ఉండగా 18 శాతానికి తగ్గించారు. రూ.100లోపు టికెట్‌పై 18శాతం నుంచి 12శాతానికి ట్యాక్స్ తగ్గించారు.
జీఎస్టీ తగ్గించడంతో టికెట్ ధరలు ఇకపై 100, 60, 20 రూపాయలుగా ఉండనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు ప్రేక్షకుల్లో ఇటు యావత్ సినీ పరిశ్రమలో ఆనందం నింపింది. ఈ నిర్ణయం సినిమా రంగంలో మరిన్ని పెట్టుబడులకు, పరిశ్రమ అభివృద్ధికి సాయంగా ఉంటుందని అన్నారు.