MSVG: చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో సహా సంక్రాంతికి వస్తున్న(MSVG) మూడు సినిమాలకు కూడా రివ్యూ అండ్ రేటింగ్ ఇవ్వకూడదు అంటూ బుక్ మై షోకి ఆదేశాలు జారీ చేసిన కోర్టు.
Court issued orders to BookMyShow to disable the review and rating option.
- చిరు సినిమాలకు రివ్యూ అండ్ రేటింగ్ ఇవ్వకూడదు
- బుక్ మై షోకి కోర్టు ఆదేశాలు
- రాజనాబ్ మినహా మిగతా మూడు సినిమాలకు కూడా అదే పరిస్థితి
MSVG: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మూవీ మన శంకరవరప్రసాద్ గారు. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి.
దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్, నార్మల్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా మన శంకరవరప్రసాద్ గురించి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సినిమా చూసిన తరువాత బుక్ మై షోలో రివ్యూలు గానీ, రేటింగ్ లు గానీ ఇవ్వకూడదు అంటూ సంచలన తీర్పు ఇచ్చింది. దానికి కారణం, ఈ మధ్య కాలంలో యాంటీ ఫ్యాన్స్ పేరుతో చాలా మంది కావాలని సినిమాలకు నెగిటివ్ రివ్యూ, రేటింగ్ లు ఇస్తున్నారు.
Samyuktha Menon: నారి నారి నడుమ మురారి ప్రమోషన్స్ లో సంయుక్త.. క్యూట్ ఫొటోస్
దానివల్ల మంచి సినిమాలపై ప్రభావం పడుతోంది. ఆలాంటి సిచువేషన్ మన శంకరవరప్రసాద్(MSVG) గారు సినిమాకు రాకూడదు అని మాకెర్స్ కోర్టును ఆశ్రయించారు. దీంతో, కోర్టు పైవిధంగా తీర్పును వెల్లడించింది. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ప్రభాస్ రాజాసాబ్ మినహాయించి మిగతా అన్ని సినిమాలు ఈ విషయంలో కోర్టు నుంచి పెర్మిషన్స్ తీసుకున్నాయి.
రవి తేజ హీరోగా వస్తున్న భర్త మనశయులకు విఙ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడుమ మురారి, నీవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలకు కూడా కోర్టు ఇదే తీరును ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ బుక్ మై షో కూడా మార్పులు చేసింది. ఈ మూడు సినిమాలకు రివ్యూ అండ్ రేటింగ్ ఆప్షన్ ను డిజేబుల్ చేసింది.
