Nitin Chauhan : టెలివిజన్ పరిశ్రమలో విషాదం.. నటుడు నితిన్ చౌహాన్ కన్నుమూత..
టెలివిజన్ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.

Crime Patrol actor Nitin Chauhan dies at the age of 35
Nitin Chauhan : టెలివిజన్ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు నితిన్ చౌహాన్ మృతి చెందాడు. ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన వయస్సు 35 సంవత్సరాలు. ఈ విషయాన్ని ఆయన స్నేహితులు సుదీప్ సాహిర్, విభూతి ఠాకుర్ ధ్రువీకరించారు. నితిన్ మరణవార్తని ఆయన స్నేహితులతో పాటు తోటీ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నితిన్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ అలీగఢ్. సినిమాలపై ఉన్న ఇష్టంతో ముంబైకి మకాం మార్చాడు. ఆయన నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. దాదాగిరి 2 అనే రియాలిటీ షోగా విజేతగా నిలిచారు.
ఆ తరువాత స్ప్లిట్స్ విల్లా 5, జిందకీ డాట్ కామ్, క్రైమ్ పాట్రోల్ వంటి రియాలిటీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘తేరా యార్ హూన్ మైన్’లో నితిన్ చివరిసారిగా స్క్రీన్‌పై కనిపించారు.
మరో వారం రోజుల్లో నితిన్ 36వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారట. ఇంతలోనే ఇలా జరిగిందంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Idli Kadai : ధనుష్ ‘ఇడ్లీ కడై’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ రోజే ప్రేక్షకుల ముందుకు..