Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి కొత్త పోస్టర్.. సాగరకన్యలా మెరిసిపోతున్న కియారా!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'.

New poster from Ram Charan Game Changer movie
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయిక. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది.
అందులో భాగంగా ఈ చిత్ర టీజర్‌ను నవంబర్ 9న విడుదల చేస్తామని చెప్పింది. ఇక టీజర్ ఈవెంట్‌ను లక్నోలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. టీజర్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉందని తెలియజేస్తూ తాజాగా చిత్ర బృందం సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
Idli Kadai : ధనుష్ ‘ఇడ్లీ కడై’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ రోజే ప్రేక్షకుల ముందుకు..
ఈ పోస్టర్‌లో కియారా అద్వాని ఎంతో అందంగా అంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, సునీల్, శ్రీకాంత్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
One day away from witnessing the magic of Global Star @AlwaysRamCharan and the beautiful @advani_kiara 🤩❤️#GameChanger 🔥#GameChangerTeaser on 9th NOVEMBER 💣
In cinemas worldwide from 10th Jan.#GamechangerOnJAN10 🚁 pic.twitter.com/4MpXxflJdY
— Game Changer (@GameChangerOffl) November 8, 2024