Idli Kadai : ధనుష్ ‘ఇడ్లీ కడై’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ రోజే ప్రేక్షకుల ముందుకు..

Dhanush Idli Kadai release date fix
Idli Kadai : స్వీయ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’(ఇడ్లీ కొట్టు). ఈ మూవీలో నిత్యామేనన్ కథానాయిక. డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిల్మ్స్ పతాకాలపై ఆకాశ్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, షాలినీ పాండేలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి సాలీడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్ర విడుదల తేదీని తెలియజేశారు.
2025 ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
ఈ చిత్రానికి జీవి ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Rahasyam Idham Jagath : ‘రహస్యం ఇదం జగత్’ మూవీ రివ్యూ.. వామ్ హోల్ కాన్సెప్ట్ కు పురాణాలు జోడించి..
View this post on Instagram