Unstoppable 4 : ఆహాలో వ‌చ్చేసిన బాల‌య్య‌, సూర్య‌ అన్‌స్టాప‌బుల్ ఫుల్‌ ఎపిసోడ్.. డైలాగులతో అద‌ర‌గొట్టేశారు

త‌న‌దైన శైలిలో మాట్లాడుతూ నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు.

Unstoppable 4 : ఆహాలో వ‌చ్చేసిన బాల‌య్య‌, సూర్య‌ అన్‌స్టాప‌బుల్ ఫుల్‌ ఎపిసోడ్.. డైలాగులతో అద‌ర‌గొట్టేశారు

Balakrishna Unstoppable Season 4 Episode 3 streaming in AHA

Updated On : November 8, 2024 / 10:40 AM IST

త‌న‌దైన శైలిలో మాట్లాడుతూ నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షో విజయవంతంగా దూసుకుపోతోంది. విజ‌య‌వంతంగా ఇప్ప‌టికే మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుని నాలుగో సీజ‌న్‌లోకి అడుగుపెట్టింది. నాలుగో సీజ‌న్ సైతం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రిస్తోంది. తొలి ఎపిసోడ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు దుల్క‌ర్ స‌ల్మాన్‌లు అతిథులుగా వ‌చ్చారు. ఇక మూడో ఎపిసోడ్‌కు హీరో సూర్య‌తో పాటు కంగువా టీమ్ వ‌చ్చింది.

ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతోంది. అర్థ‌రాత్రి 12 గంట‌ల నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. సూర్య‌తో బాల‌య్య ఎంతో స‌ర‌దాగా మాట్లాడారు.

Rajamouli-Suriya : సూర్య‌తో రాజ‌మౌళి చేయాల‌నుకున్న మూవీ ఏమిటో తెలుసా?

ఇక సూర్య త‌న‌ వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో పాటు కంగువా మూవీ విష‌యాల‌ను సైతం పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఎపిసోడ్ ఆహాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఓ లుక్కేయండి.

ఇదిలా ఉంటే.. సూర్య న‌టించిన తాజా చిత్రం కంగువా. శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ నవంబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Rahasyam Idham Jagath : ‘రహస్యం ఇదం జగత్’ మూవీ రివ్యూ.. వామ్‌ హోల్ కాన్సెప్ట్ కు పురాణాలు జోడించి..