Rajamouli-Suriya : సూర్య‌తో రాజ‌మౌళి చేయాల‌నుకున్న మూవీ ఏమిటో తెలుసా?

త‌మిళ స్టార్ హీరో సూర్య‌, ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా ఇప్ప‌టికే వ‌చ్చి ఉండాలి.

Rajamouli-Suriya : సూర్య‌తో రాజ‌మౌళి చేయాల‌నుకున్న మూవీ ఏమిటో తెలుసా?

Do you know what movie Rajamouli wanted to do with Suriya

Updated On : November 8, 2024 / 10:13 AM IST

Rajamouli-Suriya : త‌మిళ స్టార్ హీరో సూర్య‌, ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా ఇప్ప‌టికే వ‌చ్చి ఉండాలి. ఎందుకో గానీ కుద‌ర‌లేదు. ఈ విష‌యంపై సూర్య, రాజ‌మౌళిలు కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడారు. శివ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య న‌టిస్తున్న చిత్రం కంగువా. నవంబ‌ర్ 14న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గురువారం ఘ‌నంగా నిర్వ‌హించింది.

ఈ వెంట్‌ను ముఖ్య అతిథిగా రాజ‌మౌళి హాజ‌రు అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ.. బాహుబ‌లి మూవీ చేయ‌డానికి సూర్య‌నే ఇన్‌స్పిరేష‌న్ అని అన్నారు. మేమిద్ద‌రం క‌లిసి ఓ సినిమా చేయాల‌ని అనుకున్నాం. అయితే.. కుద‌ర‌లేదు. ఓ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ తాను అవ‌కాశం మిస్ అయ్యా అని అన్నాడు. కానీ ఆయ‌న మిస్ కావ‌డం కాదు నేనే ఛాన్స్ మిస్ అయ్యా అని అన్నాడు.

Rahasyam Idham Jagath : ‘రహస్యం ఇదం జగత్’ మూవీ రివ్యూ.. వామ్‌ హోల్ కాన్సెప్ట్ కు పురాణాలు జోడించి..

వెంట‌నే సూర్య మైక్ అందుకుని.. స‌ర్ నేను ట్రైన్ మిస్ అయ్యాను (రాజ‌మౌళితో సినిమా చేయ‌లేక‌పోవ‌డం గురించి). ఇప్ప‌టికి రైల్వే స్టేష‌న్‌లోనే నిల్చొని ఉన్నా. ఏదో ఒక రోజు ట్రైన్ ఎక్కుతాన‌నే న‌మ్మ‌కం ఉంది అని సూర్య చెప్పాడు.

ఇలా వీరిద్ద‌రు మాట్లాడిన మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇంత‌కి సూర్య‌తో రాజ‌మౌళి చేయాల‌నుకున్న సినిమా ఏమిటి అనే చ‌ర్చ ప్ర‌స్తుతం న‌డుస్తోంది. అయితే.. ఆ మూవీ మెగా పవ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన మ‌గ‌ధీర అని అంటున్నారు. ఓ చిత్ర ఈవెంట్‌లో ఈ విష‌యాన్ని రామ్‌చ‌ర‌ణ్ స్వ‌యంగా వెల్ల‌డించిన‌ట్లు ఉన్న ఓ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

Chiranjeevi: విశ్వంభర వీఎఫ్‌ఎక్స్‌పై చిరంజీవి అసంతృప్తి!