Kalki Pre Release Event : కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దీన్ని గమనించారా..? దీపిక చేతిని ప్రభాస్ పట్టుకోగా.. అమితాబ్ ఏం చేశాడంటే..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 AD.

Cutest moment of the Kalki 2898 AD pre release event
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో దీపిక పదుకోన్ హీరోయిన్. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. లోకనాయకుడు కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పఠానీలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
అందులో భాగంగా బుధవారం ముంబైలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా దగ్గుబాటి రానా వ్యవహరించారు. చిత్ర బృందం మొత్తం పాల్గొంది. స్టార్ నటీనటులను ఆడియో విజువల్ ప్రొమోను ప్రదర్శించి స్టేజీ మీదకు ఆహ్వానించారు. ఈ క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది.
Bigg Boss OTT 3 : జూన్ 21 నుంచి బిగ్‌బాస్ కొత్త సీజన్.. మొదటి కంటెస్టెంట్ ఎవరో చెప్పేశారు!
దీపికా పదుకోన్ గర్భవతి అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె మెల్లిగా స్టేజీపైకి నడుచుకుంటూ వచ్చారు. మూవీ గురించి మాట్లాడిన తరువాత స్టేజీ పై నుంచి కిందకు దిగుతున్నారు. ఈ సమయంలో ప్రభాస్ వచ్చి ఆమెకు సాయం చేశాడు. ఆమె చేతిని పట్టుకుని మెల్లిగా నడిపించే ప్రయత్నం చేయగా.. ప్రభాస్ వెనకనే వచ్చిన అమితాబ్ బచ్చన్ ప్రభాస్‌ను పక్కకు జరిపి ఆమె చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
PB-DP-AB Cute Moment ?❤️
Seems like they all bonded really well and had great time while shooting #Kalki2898AD ❤️?#Prabhas #AmitabhBachchan #KamalHaasan #DeepikaPadukone #NagAshwin pic.twitter.com/za4fNgItjG— Ayyo (@AyyoEdits) June 19, 2024