Bigg Boss OTT 3 : జూన్ 21 నుంచి బిగ్‌బాస్‌ కొత్త సీజన్.. మొద‌టి కంటెస్టెంట్ ఎవరో చెప్పేశారు!

ఎన్నో షోలు ఉన్న‌ప్ప‌టికి బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజే వేరు.

Bigg Boss OTT 3 : జూన్ 21 నుంచి బిగ్‌బాస్‌ కొత్త సీజన్.. మొద‌టి కంటెస్టెంట్ ఎవరో  చెప్పేశారు!

Bigg Boss OTT 3 Viral Vada Pav Girl Chandrika Dixit 1st Confirmed Contestant

Updated On : June 19, 2024 / 7:23 PM IST

Bigg Boss OTT 3 – Chandrika Dixit : ఎన్నో షోలు ఉన్న‌ప్ప‌టికి బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజే వేరు. ఎన్ని సీజ‌న్లు వ‌చ్చినా, ఏ బాష‌లో ప్ర‌సారం అయినా కూడా ఈ షోకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక హిందీలో బిగ్‌బాస్ షో 17 సీజ‌న్లను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ప్రేక్ష‌కుల‌కు మ‌రింత మ‌జాను పంచేందుకు బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. టీవీల్లో కాకుండా కేవ‌లం ఓటీటీలో మాత్ర‌మే ఈ షోకి చూడాల్సి ఉంటుంది.

బిగ్‌బాస్ ఓటీటీ రెండు సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. మూడో సీజ‌న్‌కు సిద్ద‌మైంది. రెండో సీజ‌న్‌కు స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా మూడో సీజ‌న్‌కు న‌టుడు అనిల్ క‌పూర్ హోస్ట్‌గా ఎంచుకున్నారు. ఇక ఫ‌స్ట్ కంటెస్టెంట్ ను కూడా రిలీల్ చేశారు. బిగ్‌బాస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెస్టెంట్ అంటూ ఫోటోల‌ను పోస్ట్ చేసింది.

Vijay Deverakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో న‌టించాల‌ని అనుకుంటున్నారా..? ఈ ఛాన్స్ మీకోస‌మే..

ఓ చిన్న బండి దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. ఈఫోటోల‌ను చూసిన నెటిజన్లు.. ఆమె ఫేమస్‌ వడాపావ్‌ గర్ల్‌ చంద్రిక అని అంటున్నారు. ఢిల్లీ వీధుల్లో వడాపావ్‌ అమ్ముతూ చంద్రిక ఫేమస్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో అంద‌రిని దృష్టిని ఆక‌ర్షించిన ఈ అమ్మాయి ఓటీటీలో ఎలా అల‌రిస్తుందో చూడాలి. ఇక హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజ‌న్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది.

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)