Vijay Deverakonda : విజయ్ దేవరకొండ సినిమాలో నటించాలని అనుకుంటున్నారా..? ఈ ఛాన్స్ మీకోసమే..
దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించాడు.

Do you want to act in Vijay Deverakonda movie
Vijay Deverakonda – SVC 59 : దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించాడు. మళ్ళీ దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో 59వ సినిమాగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. రాజావారు రాణిగారు సినిమా దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రూరల్ యాక్షన్ డ్రామా కథతో ఈ సినిమా ఉండనుంది.
ఇక ఈ సినిమాలో నటించాలని మీకు ఉందా..? అయితే.. ఇదే సరైన అవకాశం. మీకు యాక్టింగ్ వస్తే చాలు.. తెలుగు వస్తే సంతోషం.. గోదావరి యాసొత్తే ఇంకాపేవోడే లేడు అంటూ చిత్రబృందం నటీనటులను అన్వేషిస్తున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేసింది. వెంటనే మీ ప్రొఫైల్స్‌ను svc59casting@gmail.com మెయిల్ చేయొచ్చునని లేదంటే సూచించిన నంబర్‌కి వాట్సాప్ కూడా చేయొచ్చునని తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం మీలో యాక్టింగ్ టాలెంట్ ఉంటే వెంటనే మీ ప్రొఫైల్‌ను పంపించండి.
Shivam Bhaje : ‘శివం భజే’ గ్లింప్స్ రిలీజ్.. ‘ఈ యుద్ధం నీది కాదు.. స్వయంగా ఆ నీలకంఠుడే..’
ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.. అంటూ రక్తంతో తడిచిన చేయి ఓ కత్తిని పట్టుకొని ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో విజయ్ ఊర మాస్ గా కనిపించబోతున్నట్టు అర్ధమవుతుంది. ఈ ఒక్క పోస్టర్, డైలాగ్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
Acting osthe chaaalu…?
తెలుగొస్తే సంతోషం… ?
గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు ?Put yourself on the Big Screen &
The Bigger World of #SVC59 ✊Share your profiles on svc59casting@gmail.com
(or)?️ WhatsApp on +91 9676843362@TheDeverakonda @storytellerkola@SVC_official pic.twitter.com/4yNBePoGvH— Sri Venkateswara Creations (@SVC_official) June 19, 2024