MAA Elections : దేశం, ధర్మం అంటే చులకన భావం ఉన్న ప్రకాష్ రాజ్‎ను ఓడించండి – సీవీఎల్

దేశం, ధర్మం అంటే చులకన భావం ఉన్న ప్రకాష్ రాజ్‎ను ఓడించాలని సినీ నటుడు సీవీఎల్ నరసింహారావు కోరారు. మంగళవారం ఓ వీడియో విడుదల చేసిన ఆయన తెలంగాణ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Maa Elections

MAA Elections : ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇరు ప్యానెళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే సినీ నటుడు సీవీఎల్ నరసింహారావు మా ఎన్నికలపై మాట్లాడారు. తెలంగాణకు చెందిన వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ పై విమర్శలు గుప్పించారు నరసింహారావు.. దేశం ధర్మం అంటే చులకన భావం ఉన్న ప్రకాష్ రాజుని ఓడించాలని కోరారు. గతంలో అనేక డిబేట్లలో దేశం, ధర్మంపై చులకనగా మాట్లాడారని తెలిపారు. మా ఎన్నికల్లో ఓటర్లు అలోచించి ఓటు వేయాలని తెలియచేశారు.

Read More : Maa Election: నా ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారు..! నరేష్, కళ్యాణిలపై నటి హేమ ఫిర్యాదు

ఇక ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఇరు ఫ్యానెళ్ల సభ్యుల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. కొందరు అభ్యర్థులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ఇక కరాటే కళ్యాణి తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తుందంటూ.. జీవిత, హేమలు ‘మా’ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్.. అభ్యర్థులు హుందాగా ఉండాలని తెలిపారు. ఈ మేరకు ప్రెస్ నెట్ విడుదల చేశారు.

Read More : MAA Elections : అప్పుడు మోహన్ బాబు.. ఇప్పుడు విష్ణు.. 17 ఏళ్ల తర్వాత సీన్ రిపీట్ అవ్వుద్దా??