Daaku Maharaaj Release Trailer out now
Daaku Maharaaj Release Trailer : నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాధ్‌లు కథానాయికలు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్నఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసినా అనూహ్యంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే.. వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
Rashmika Mandanna : రష్మికకు గాయం.. సినిమా షూటింగ్‌లకు బ్రేక్.. ఆందోళనలో అభిమానులు..
ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది. బాలయ్య డైలాగులు ఈలలు వేయించేలా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అయితే నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలే ఉండగా తాజా ట్రైలర్‌తో అవి అమాంతం పెరిగిపోయాయి.