Rashmika Mandanna : రష్మికకు గాయం.. సినిమా షూటింగ్‌లకు బ్రేక్.. ఆందోళనలో అభిమానులు..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గాయపడినట్లు తెలుస్తోంది.

Pushpa 2 Actress Rashmika Mandanna suffers Gym Injury Know the Health Updates
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గాయపడినట్లు తెలుస్తోంది. ఆమె జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఆమె కాలికి గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. రష్మికకు గాయం కావడంతో ఆమె నటిస్తున్న చిత్రాల షూటింగ్ ఆగిపోయాయి. ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె బాగానే కోలుకుంటున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల జిమ్ చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు రష్మిక గాయపడింది. ఆమె విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటుంది. గాయం కావడం వల్ల ఆమె నటిస్తున్న సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడింది. గాయం చిన్నదే అయినా ఓ వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆమె వేగంగా కోలుకుంటుంది. త్వరలోనే ఆమె షూటింగ్‌లకు వెళ్లనుంది. అని రష్మిక సన్నిహిత వర్గాలు తెలిపాయి.
TS High Court : బెనిఫిట్ షోలు రద్దు చేశామని అంటూ ప్రత్యేక షోలకు అనుమతేంటి?: హైకోర్టు
రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటించిన పుష్ప 2 మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రికార్డులు అన్నింటిని తిరగరాస్తోంది. ఇప్పటికే 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండు వేల కోట్ల వైపుగా పరుగులు పెడుతుంది.
ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో కలిసి సికిందర్ మూవీలో నటిస్తుంది. ఏఆర్ మురగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంతో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. విక్కీ కౌశల్ సరసన చావాలో, ఆయుష్మాన్‌తో థామ చిత్రంలోనూ రష్మిక నటిస్తోంది.