Devara : ఎన్టీఆర్ దేవ‌ర‌లో ద‌స‌రా విల‌న్‌..! ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడా..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం దేవ‌ర‌. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Shine Tom chacko in Devara

Devara-Shine Tom chacko : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(JR NTR) న‌టిస్తున్న చిత్రం ‘దేవ‌ర‌'(Devara). కొరటాల శివ(Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా న‌టిస్తోంది. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ గా న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్‌లో హైద‌రాబాద్‌లో కొన‌సాగుతోంది.

Chinmayi Sripaada : సింగ‌ర్ చిన్మ‌యి శ్రీపాద క‌వ‌ల పిల్ల‌ల‌ను చూశారా..? ఎంత అందంగా ఉన్నారో

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. నాని, కీర్తి సురేశ్ జంట‌గా న‌టించిన ‘ద‌స‌రా’ సినిమాలో విల‌న్‌గా న‌టించిన షైన్ టామ్‌ చాకో (Shine Tom Chacko) దేవ‌ర చిత్రంలో న‌టిస్తున్నాడ‌ట‌. ఈ సినిమాలో అత‌డి పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఉండ‌నుంద‌ని అంటున్నారు. కాగా.. షైన్ టామ్ చాకో ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా తెలియ‌జేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫ్యాన్ మేడ్ ఫోస్ట‌ర్‌ని షేర్ చేశాడు. షైన్ టామ్‌ చాకో ప్ర‌స్తుతం నాగశౌర్య నటిస్తోన్న ‘రంగబలి’ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు.

Malli Pelli Ott Release Date : అఫీషియల్ : రెండు ఓటీటీల్లో న‌రేశ్, ప‌విత్ర‌ల ‘మళ్ళీ పెళ్లి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Shine Tom chacko

ఇదిలా ఉంటే.. ‘దేవ‌ర’ సినిమా పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా బ్యాక్‌ డ్రాప్‌ చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా వ‌స్తోంది. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మ‌ల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి ర‌త్న‌వేల్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.