Chinmayi Sripaada : సింగ‌ర్ చిన్మ‌యి శ్రీపాద క‌వ‌ల పిల్ల‌ల‌ను చూశారా..? ఎంత అందంగా ఉన్నారో

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద(Chinmayi Sripaada) ప‌రిచ‌యం చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. డబ్బింగ్, సింగింగ్ తో ప్రేక్షకులకు చేరువైంది. న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) ని 2014లో చిన్మ‌యి ప్రేమ వివాహం చేసుకుంది.

Chinmayi Sripaada : సింగ‌ర్ చిన్మ‌యి శ్రీపాద క‌వ‌ల పిల్ల‌ల‌ను చూశారా..?  ఎంత అందంగా ఉన్నారో

Chinmayi Sripaada twins

Updated On : June 21, 2023 / 6:59 PM IST

Chinmayi Sripaada twins : ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద(Chinmayi Sripaada) ప‌రిచ‌యం చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. డబ్బింగ్, సింగింగ్ తో ప్రేక్షకులకు చేరువైంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దారుణాల‌ను ప్ర‌శ్నిస్తూ వారికి అండ‌గా నిలుస్తుంటుంది. న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) ని 2014లో చిన్మ‌యి ప్రేమ వివాహం చేసుకుంది. కాగా.. గ‌తేడాది జూన్ 18న ఈ జంట‌కు క‌వ‌ల పిల్ల‌లు జ‌న్మించారు. వారిలో ఓ పాప‌, బాబు ఉన్నారు. వారికి ద్రిప్తా(Driptah), శ‌ర్వాస్(Sharvas) అనే పేర్ల‌ను పెట్టారు.

Minister Roja : రామ్‌చరణ్ కూతురు పై మంత్రి రోజా ఎమోషనల్ ట్వీట్.. చరణ్‌ని చిన్నప్పుడు ఎత్తుకున్న..

పిల్ల‌లు జ‌న్మించి సంవ‌త్స‌రం అవుతున్నా కూడా వారి ముఖాల‌ను బ‌య‌టికి చూపించ‌లేదు. ఎట్ట‌కేల‌కు పిల్ల‌లను అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి త‌న చిన్నారుల‌కు సంబంధించిన కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. మొద‌టి ఫోటోలో గాయ‌ని చిన్మ‌యి త‌న ఇద్ద‌రు చిన్నారుల‌ను ఎత్తుకుని ఉండ‌గా భ‌ర్త రాహుల్‌తో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న‌ట్లు క‌నిపించింది. త‌రువాతి ఫోటోల్లో చిన్నారులు ఆడుకోవ‌డం, నిద్ర‌పోవ‌డం, తిన‌డం వంటివి ఉన్నాయి. “ఇది గొప్ప ఆశీర్వాదం” అంటూ ఆ ఫోటోల‌కు చిన్మ‌యి క్యాప్ష‌న్ ఇచ్చింది. రెండు హార్ట్ ఎమోజీల‌ను జ‌త చేసింది. ప్ర‌స్తుతం ఈ చిన్నారుల ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Malli Pelli Ott Release Date : అఫీషియల్ : రెండు ఓటీటీల్లో న‌రేశ్, ప‌విత్ర‌ల ‘మళ్ళీ పెళ్లి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

గ‌త సంవ‌త్స‌రం ఈ జంట తాము త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రులు కాబోతున్నాము అని ప్ర‌క‌టించారు. అయితే ఆ స‌మ‌యంలో చిన్మ‌యిపై దారుణ‌మైన ట్రోల్స్ వ‌చ్చాయి. స‌రోగ‌సి ద్వారా పిల్ల‌ల‌కు జ‌న్మించారు అనే ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. త‌న బేబీ బంప్ ఫోటోల‌తో ఆ రూమ‌ర్ల‌కు చెక్ పెట్టింది చిన్మ‌యి. అదే స‌మ‌యంలో త‌న చిన్నారుల ముఖాన్ని బ‌హిర్గ‌తం చేయ‌న‌ని చెప్పింది. త‌న వ్య‌క్తిగ‌త జీవితం, కుటుంబ‌, స్నేహితుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటానంది.

Chiranjeevi : చ‌ర‌ణ్ కూతురు ఎంట్రీ.. మెగాస్టార్‌కు ఎంత మంది మ‌న‌వ‌రాళ్లో తెలుసా..?