Sai Dharam Tej : అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించిన సాయి ధరమ్ తేజ్ సినిమాలు..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయో తెలుసా..?

Sai Dharam Tej : అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించిన సాయి ధరమ్ తేజ్ సినిమాలు..

Sai Dharam Tej

Updated On : October 4, 2021 / 6:54 PM IST

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై.. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు తేజ్ ఆదివారం (అక్టోబర్ 3) ట్వీట్ చేశాడు. తేజ్ త్వరగా కోలుకోవాలంటూ మెగాభిమానులు, సినీ పరిశ్రమ వారు సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేశారు.

సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి కారణమైన స్పోర్ట్స్ బైక్ ఇదే..!

ఇదిలా ఉంటే పాండమిక్ తర్వాత తేజ్ – దేవ కట్టా దర్శకత్వంలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. తేజ్ నటనతో పాటు సినిమాకు మంచి టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా ఆశించినం స్తాయిలోనే వస్తున్నాయి. ఫస్ట్ డే దాదాపు రెండు కోట్లకు పైగా రాబట్టింది. తేజ్ నటించిన లాస్ట్ ఫైవ్ మూవీస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఎంత కలెక్షన్లు వసూలు చేశాయో చూద్దాం..

Republic Review : ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ

‘ఇంటిలిజెంట్’ – రూ.1.8 కోట్లు
‘తేజ్ – ఐ లవ్ యూ’ – రూ. 1.72 కోట్లు
‘చిత్రలహరి’ – రూ. 3.26 కోట్లు
‘ప్రతిరోజూ పండగే’ – రూ. 3.12 కోట్లు
‘సోలో బ్రతుకే సో బెటర్’ – రూ. 2.91 కోట్లు
వసూళ్లు సాధించగా.. ‘రిపబ్లిక్’ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 2.01 కోట్లు కలెక్ట్ చేసింది..

Ram Pothineni : రామ్ పోతినేని మెడకు గాయం